తమిళనాడు తిరుప్పూర్లోని గార్మెంట్ ఫ్యాక్టరీలో ఓ ఉద్యోగి ఎప్పటిలాగే విధులకు వచ్చాడు. కానీ తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం లావుగా కనిపించాడు. ఫ్యాక్టరీ సూపర్వైజర్కు అనుమానం వచ్చి అతడి దుస్తులు విప్పమని చెప్పగా.. అతని బండారం బయటపడింది. మొదట ఆ ఉద్యోగి నిరాకరించినా.. వేరే మార్గం లేక వాటిని తొలగించాడు. కర్మాగారంలో ఉత్పత్తి చేసిన సుమారు 100 టీ షర్టులను తన కాళ్లలో దాచిపెట్టాడు ఆ ఉద్యోగి.
టీ షర్టులను స్వస్థలంలో అమ్ముకునేందుకే చోరీ చేసినట్లు తెలిపాడు. ఈ తతంగమంతా అక్కడున్న కొంతమంది తమ చరవాణిలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.