ETV Bharat / bharat

'మహా' రైలు ప్రమాదంపై ఎన్​హెచ్​ఆర్​సీ నోటీసులు - మహారాష్ట్ర రైలు ప్రమాదం

ఔరంగాబాద్​లో వలస కూలీలను బలి తీసుకున్న రైలు ప్రమాదానికి సంబంధించి మహారాష్ట్ర సీఎస్​కు జాతీయ మానవ హక్కుల కమిషన్​ నోటీసులు జారీ చేసింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, అధికారులు తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని ఆదేశించింది.

NHRC-MH-ACCIDENT
'మహా' ప్రమాదం
author img

By

Published : May 8, 2020, 7:23 PM IST

ఔరంగాబాద్​ రైలు ప్రమాదానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్​ (ఎన్​హెచ్​ఆర్​సీ) నోటీసులు జారీ చేసింది. ఘటనపై నాలుగు వారాల్లో పూర్తి నివేదిక అందించాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శితోపాటు ఔరంగాబాద్​ జిల్లా మేజిస్ట్రేట్​కు ఆదేశించింది.

"ప్రమాదానికి సంబంధించి 4 వారాల్లో పూర్తి వివరాలు సమర్పించాలి. పేదలు, వలస కార్మికులు, లాక్​డౌన్​ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా ఈ నివేదికలో పొందుపరచాలి. వారికి ఆహారం, ఆశ్రయం, ఇతర సదుపాయాలు ఏమేం కల్పించారో తెలియజేయాలి."

-ఎన్​హెచ్​ఆర్​సీ

నాందేడ్​ డివిజన్​లోని బద్నాపుర్​- కర్మాడ్​ స్టేషన్ల మధ్య పట్టాలపై నిద్రిస్తున్న 20 మంది వలస కూలీలపై నుంచి గూడ్సు రైలు వెళ్లింది. ఈ ఘటనలో 14 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

విశ్రాంతి కోసం..

వీరంతా జల్నా నుంచి భుసావల్​ (150 కిలోమీటర్లు)కు నడుచుకుంటూ వెళుతున్నారు. 45 కిలోమీటర్ల మేర నడిచిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు పట్టాలపై నిద్రించారు. సుమారు ఉదయం 5.15 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మీడియా సమాచారంతో సుమోటోగా కేసును నమోదు చేసుకుంది ఎన్​హెచ్​ఆర్​సీ.

పట్టాలపై కొంతమంది నిద్రిస్తున్నట్లు లోకోపైలట్​ గుర్తించినట్లు తెలుస్తోంది. హారన్​ మోగించినా, రైలు ఆపాలని ప్రయత్నించినా సాధ్య పడలేదని సమాచారం. ఈ విషయంలో రైల్వే మంత్రిత్వ శాఖ విచారిస్తోంది.

ఇదీ చూడండి: తెల్లారేసరికి 'కూలీ'న బతుకులు- నిద్దట్లోనే అనంతలోకాలకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.