ETV Bharat / bharat

'ఉపాధి హామీ పెంచి.. ఆ పథకం అమలు చేయండి' - రాహుల్ గాంధీ ఉపాధి హామీ

నిరుద్యోగం, పేదరికంలో ఉన్నవారికి చేయూతనిచ్చేలా కనీస ఆదాయ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వీటిని అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందన్నారు. పేదల బాధలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందా అని ప్రశ్నించారు.

Necessary to implement MGNREGA, NYAY; will boost economy: Rahul
'ఉపాధి హామీ పెంచి- న్యాయ్ పథకం అమలు చేయండి'
author img

By

Published : Aug 11, 2020, 10:46 AM IST

దేశవ్యాప్తంగా పేదరికంలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులను ఆదుకునేందుకు పట్టణ ప్రాంతాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం అత్యవసరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన కనీస ఆదాయ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రెండు పథకాలను అమలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు సైతం మేలు చేస్తుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పేదల బాధలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ గ్రాఫ్​ను ట్వీట్​కు జతచేశారు.

"పట్టణాల్లో నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్న వారి కోసం మనరేగా పథకం అమలు చేయడం అవసరం. దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజల కోసం న్యాయ్ పథకాన్ని అమలు చేయాలి. 'సూటు-బూటు-లూట్' ప్రభుత్వం పేదల బాధలను అర్థం చేసుకుంటుందా?"

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఉపాధి హామీ పరిధిని పెంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పేదలకు నేరుగా నగదు బదిలీ చేయాలని పేర్కొంది. జన్​ధన్ ఖాతాలు, పెన్షన్ ఖాతాలు, పీఎం-కిసాన్ ఖాతాల్లో రూ.7,500 జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.

ఇదీ చదవండి: కరోనాను జయించినా వివక్షతో సమాజం చంపేసింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.