ETV Bharat / bharat

కన్న పిల్లల ఎదుటే భార్యను చంపిన కిరాతకుడు - భార్యను చంపిన భర్త

ఓ కిరాతకుడు కన్న బిడ్డల ఎదుటే భార్యను చంపిన ఘటన మధ్యప్రదేశ్​ ఖాండ్వా జిల్లాలో జరిగింది. మహిళను బండరాయితో కొట్టి చంపిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

MP man bludgeons wife to death in front of their 6 children
కన్న పిల్లల ఎదుటే భార్యను చంపిన కిరాతకుడు
author img

By

Published : Jun 14, 2020, 5:25 PM IST

మధ్యప్రదేశ్​ ఖాండ్వా జిల్లాలో దారుణం జరిగింది. కన్న బిడ్డల ఎదుటే కట్టుకున్న భార్యను చంపాడు ఓ కిరాతకుడు.

ఇదీ జరిగింది...

కాద్​వాలియ గ్రామంలో సూరజ్​ దంపతులు గత కొంతకాలంగా నివాసముంటున్నారు. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సూరజ్​ తన భార్యను ఎప్పుడూ అనుమానిస్తూనే ఉండేవాడు. ఈ విషయంపై శుక్రవారం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. సూరజ్​ సోదరుడు వచ్చి ఇద్దరికి సర్ది చెప్పటం వల్ల గొడవ సద్దుమణిగింది. కానీ శనివారం ఉదయం సూరజ్​ సోదరుడు నిద్రలేచే సరికి ఆమె శవమై కనిపించింది. ఆ ఆరుగురు పిల్లలు తల్లి శవం వద్ద కూర్చుని రోదిస్తున్నారని పోలీసులు తెలిపారు.

సదరు మహిళను నిందితుడు రాయితో తలపై కొట్టి చంపాడని పిల్లలు చెప్పినట్లు వెల్లడించారు పోలీసులు. శనివారం రాత్రి సూరజ్​ను​ అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:'3టీ వ్యూహంతోనే వైరస్​పై విజయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.