ETV Bharat / bharat

నిర్బంధంలో భారత్​- కఠిన ఆంక్షలు విధింపు - లాక్​డౌన్ రాష్ట్రాలు

కరోనా వైరస్​ నివారణ చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరం చేశాయి. చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా నియమాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం ఆదేశించింది. లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచించారు. మహారాష్ట్ర, పంజాబ్‌ సహా పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూను విధించాయి ఆయా ప్రభుత్వాలు.

india lockdown
నిర్బంధ భారత్
author img

By

Published : Mar 23, 2020, 9:49 PM IST

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలంటూ ప్రధాని మోదీ రాష్ట్రాలకు సూచించారు. నిర్బంధం కారణంగా దేశ రాజధాని దిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దిల్లీ ఎయిమ్స్‌లో ఓపీ విభాగాన్ని, వివిధ ప్రత్యేక విభాగాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తదుపరి ఆదేశాల ఇచ్చేంత వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు.

కఠిన చర్యలకు ఆదేశం

నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. అందరూ ఆరోగ్య సూచనలు పాటించాలని ట్విట్టర్‌ వేదికగా సూచించారు.

మహారాష్ట్రలో కర్ఫ్యూ...

మహారాష్ట్రలో సోమవారం నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఠాక్రే ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • అత్యవసర సేవలు మినహా మంగళవారం నుంచి ఏప్రిల్‌ 18 వరకు, అన్ని కార్యక్రమాలను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
  • తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ను ప్రకటించారు. మార్చి 31 వరకు నిర్బంధం కొనసాగుతుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. దాదాపు 3 వేల ఇళ్లను క్వారంటైన్​లో ఉంచారు.
  • గోవా సర్కారు మరో 3 రోజుల పాటు జనతా కర్ఫ్యూను పొడిగించింది.
  • ఛత్తీస్‌గఢ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, అసోం, బిహార్, అరుణాచల్ ప్రదేశ్‌లోనూ ఈనెల 31 వరకు లాక్​డౌన్ ప్రకటించాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు.
  • ఈ క్లిష్ట సమయంలో లాక్​డౌన్​కు ప్రజలు సహకరించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విట్టర్‌ ద్వారా అభ్యర్థించారు. దిల్లీలో సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు అత్యవసర సేవలు మినహా అందరూ బంద్‌ పాటించాలని కేజ్రీవాల్‌ సూచించారు.
  • ఉత్తర్‌ప్రదేశ్‌లోని 16జిల్లాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. సోమవారం నుంచి ఈనెల 25వరకు ఈ జిల్లాల్లో ఆంక్షలు కొనసాగుతాయని యోగి సర్కార్‌ ప్రకటించింది.
  • మణిపుర్​లో మార్చి 31 వరకు నిర్బంధం ప్రకటిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐసోలేషన్ వార్డులను నెలకొల్పేందుకు చర్యలు చేపడుతోంది.
  • లాక్‌డౌన్‌ను ప్రజలు సరిగ్గా పాటించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు పంజాబ్‌ సర్కారు ప్రకటించింది. కర్ఫ్యూను అతిక్రమిస్తే గట్టి చర్యలు తప్పవని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పేర్కొన్నారు.
  • కేవలం 7 జిల్లాలకు పరిమితమైన లాక్​డౌన్​ను రాష్ట్రమంతా వర్తింపజేస్తున్నట్లు హరియాణా ప్రకటించింది.
  • కొవిడ్​ నియంత్రణ చర్యలను ముమ్మరం చేయడంలో భాగంగా.. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్​​లతో ఉన్న అంతర్-రాష్ట్ర సరిహద్దులను మూసేస్తున్నట్లు జమ్ము కశ్మీర్​ కేంద్ర పాలిత ప్రాంతం యంత్రాంగం స్పష్టం చేసింది. ఉపశమన చర్యల కోసం రూ.40 కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయించింది.
  • చండీగఢ్​లో సోమవారం రాత్రి నుంచి పూర్తిస్థాయి కర్ఫ్యూ విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
  • త్రిపుర, అసోంలలోనూ లాక్​డౌన్​పై ప్రకటన చేశారు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
  • కరోనా వైరస్ ప్రభావంతో కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడనున్నాయి. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయనున్నట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే ప్రకటించారు.

ఇదీ చదవండి: అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.