ETV Bharat / bharat

ఇకపై రైలెక్కాలంటే ఇవి పాటించాల్సిందే! - MHA issues SOP for trains travel

దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి 15 ప్రత్యేక ప్యాసింజర్​ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణాల్లో పాటించాల్సిన ప్రామాణిక విధివిధానాలను కేంద్ర హోంశాఖ రూపొందించింది. ప్రయాణాల్లో భాగంగా తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. వైరస్ లక్షణాలు లేని, చెల్లుబాటయ్యే టికెట్ ఉన్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించనున్నట్లు పేర్కొంది.

MHA issues SOP for trains travel
కరోనా ఎఫెక్ట్​: రైలెక్కాలంటే ఇవి పాటించాల్సిందే!
author img

By

Published : May 11, 2020, 3:41 PM IST

ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో.. ప్రయాణాల్లో భాగంగా పాటించాల్సిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను(ఎస్​ఓపీ) కేంద్ర హోంశాఖ జారీ చేసింది. వైరస్ లక్షణాలు లేనివారు, చెల్లుబాటయ్యే టికెట్ ఉన్నవారిని మాత్రమే రైలు ప్రయాణానికి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది.

"నిర్ధరించిన ఈ-టికెట్ ఉన్నవారికి మాత్రమే స్టేషన్​లోకి అనుమతి లభిస్తుంది. ప్రయాణికులందరికీ స్క్రీనింగ్ జరిగేలా రైల్వే శాఖ జాగ్రత్త వహిస్తుంది. లక్షణాలు లేని వారినే ప్రయాణం చేయడానికి అనుమతిస్తారు." -హోంశాఖ ఎస్​ఓపీ

  • స్టేషన్​లోకి ప్రవేశించిన సమయం నుంచి గమ్య స్థానాలకు చేరుకునే వరకు ప్రయాణికులందరు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలి.
  • స్వస్థలాలకు చేరుకున్న అనంతరం ఆయా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు పాటించాలి.
  • స్టేషన్లతో పాటు రైల్వే కోచ్​లలో ప్రయాణికులందరికీ శానిటైజర్లు అందించనున్నట్లు హోంశాఖ స్పష్టం చేసింది.

మార్చి 25న లాక్​డౌన్ విధించిన తర్వాత ప్యాసింజర్​ రైళ్లను రద్దు చేసింది భారతీయ రైల్వే. తాజాగా మే 12నుంచి ఈ రైళ్లను దశల వారిగా పునరుద్ధరించనున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ మేరకు దిల్లీ నుంచి 15 ప్రత్యేక రైళ్లు ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేయనున్నాయి. మంగళవారం నుంచి రైలు ప్రయాణాలు ప్రారంభంకానుండగా.. బుకింగ్స్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు మొదలవుతాయి.

మరోవైపు రైళ్ల ప్రయాణాల అంశం రైల్వేశాఖ ఆధ్వర్యంలోనే ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. మరిన్ని రైళ్లను అనుమతించే అంశంపై హోం, వైద్య శాఖల సమన్వయంతో రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.