ETV Bharat / bharat

దిల్లీ ప్రభుత్వ పాఠశాలకు మెలానియా ట్రంప్ - మెలానియా ట్రంప్

దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ సందర్శించారు. ప్రత్యేక వేషధారణలో చిన్నారులు అమెరికా అధ్యక్షుడి సతీమణికి అపూర్వ సాగతం పలికారు.

melania
మెలానియా
author img

By

Published : Feb 25, 2020, 12:05 PM IST

Updated : Mar 2, 2020, 12:23 PM IST

భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సతీమణి మెలానియా ట్రంప్​.. దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. తమ పాఠశాలకు వచ్చిన మెలానియాకు పాఠశాల విద్యార్థులు ప్రత్యేక సాగతం పలికారు.

కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'క్లాస్​ ఆఫ్ హ్యాపీనెస్​' గురించి స్వయంగా తెలుసుకునేందుకు ఆమె వచ్చారు. తరగతి గదిలోకి వెళ్లి పిల్లలకు బోధించే విధానాన్ని పరిశీలించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించారు. వ్యాయామ తరగతులను వీక్షించారు.

పాఠశాలలో మెలానియా ట్రంప్

కేజ్రీవాల్​ ఆలోచన నచ్చి..

2018లో అరవింద్​ కేజ్రీవాల్​ ప్రభుత్వం 'క్లాస్​ ఆఫ్​ హ్యాపినెస్'​ను ప్రవేశపెట్టింది. నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు ఇందులో పాల్గొనేలా.. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది.

'క్లాస్ ఆఫ్ హ్యాపీనెస్​​'లో చిన్నారి మనసులను సానుకూల దృక్పథంతో నింపి.. ఆనందమైన జీవితంపైపు అడుగులు వేయిస్తున్నారు ఉపాధ్యాయులు. విద్యార్థుల్లో ఒత్తిడి తీసేసి, ఆసక్తికరమైన కథలు చెప్పి వారిలో విలువలు పెంచే దిశగా కదం తొక్కుతున్నారు.

Last Updated : Mar 2, 2020, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.