ETV Bharat / bharat

కమ్యూనిస్టుల బుక్​ ఆర్డర్​ చేస్తే 'గీత' డెలివరీ

సుతిర్తొ దాస్​ అనే వ్యక్తి.. ఇటీవలే కమ్యూనిస్ట్​ మేనిఫెస్టో అనే పుస్తకం కోసం ఆన్​లైన్​లో ఆర్డర్​ ఇచ్చాడు. అయితే దానికి బదులు అతడికి భగవత్​ గీత అందించింది ఓ ఈ-కామర్స్​ దిగ్గజ సంస్థ. ఇదే విషయాన్ని దాస్​ ఫేస్​బుక్​లో పోస్ట్​ చేయగా.. అది చూసిన వారందరూ విపరీతంగా నవ్వుకుంటున్నారు.

Man orders 'communist manifesto' online, gets copy of 'Bhagavad Gita'
కమ్యూనిస్ఠ్​ మేనిఫెస్టో ఆర్డర్​ ఇస్తే.. 'గీత' వచ్చింది!
author img

By

Published : Jun 15, 2020, 6:23 PM IST

ఆన్​లైన్​లో వస్తువులు, దుస్తులు, పుస్తకాలు ఆర్డర్​ ఇవ్వడం సహజం. అయితే కొన్ని కొన్ని సార్లు మనం ఆర్డర్​ ఇచ్చిన వాటికి బదులు వేరే వస్తువులు వచ్చి చేరతాయి. తాజాగా సుతిర్తొ దాస్​కు కూడా ఇదే అనుభవం ఎదురైంది. 'కమ్యూనిస్ట్​ మేనిఫెస్టో'ను ఆర్డర్​ ఇస్తే... విచిత్రంగా 'భగవత్ గీత' అతడి ఇంటి తలుపు తట్టింది.

కమ్యూనిస్ట్​ మేనిఫెస్టో అనుకుంటే...

సుతిర్తొ దాస్​ ఈ నెల 10న.. ఓ ఈ-కామర్స్​ ఫ్లాట్​ఫాంలో కమ్యూనిస్ట్​ మేనిఫెస్టో పుస్తకాన్ని ఆర్డర్​ ఇచ్చారు. 13న పార్సిల్​ను అతడి ఇంటికి డెలివరీ చేసింది ఆ దిగ్గజ ఈ-కామర్స్​ సంస్థ. ఇంటికి వెళ్లిన అనంతరం ఆ ప్యాకేజీని తెరిచిన దాస్​.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

"ఇంటికి వెళ్లగానే.. నేను పార్సిల్​ను తెరిచాను. అయితే అందులో నేను ఆర్డర్​ చేసిన కమ్యూనిస్ట్​ మేనిఫెస్టో బదులు.. భగవత్​ గీత ఉంది. నేను ఆశ్చర్యపోయాను."

--- సుతిర్తొ దాస్​.

ఈ వ్యవహారం గురించి ఫేస్​బుక్​లో పోస్ట్​ చేశాడు దాస్​. సంబంధిత ఫొటోలను కూడా జోడించాడు.

ఈ పోస్ట్​ చూసినవారందరూ విపరీతంగా నవ్వుకోవడం మొదలుపెట్టారు. ఆ రెండు పుస్తకాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూసి ఫన్నీ కామెంట్స్​ చేస్తున్నారు.

ఇదే విషయంపై ఆ ఈ-కామర్స్​ దిగ్గజ సంస్థను సంప్రదించడానికి ప్రయత్నించగా.. ఎవరూ స్పందించలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.