ETV Bharat / bharat

1100 అడుగుల ఎత్తులో శివరాత్రి వేడుకలు - శంకరాచార్యా ఆలయంలో పూజలు

మహాశివరాత్రి సందర్భంగా జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లోని 11 వందల అడుగుల ఎత్తులో ఉన్న చారిత్రక శ్రీ శంకరాచార్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు జాగారం చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ ఆలయ విశేషాలు మీకోసం...

shankaracharya
శంకరాచార్య ఆలయంలో ప్రత్యేక పూజలు
author img

By

Published : Feb 21, 2020, 8:47 PM IST

Updated : Mar 2, 2020, 2:49 AM IST

1100 అడుగుల ఎత్తులో శివరాత్రి వేడుకలు

జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో 11వందల అడుగుల ఎత్తులో ఉంది శ్రీ శంకారాచార్య శివాలయం. శతాబ్దాల క్రితం కశ్మీర్​లోని ఈ ఆలయాన్ని సందర్శించిన ఆధ్యాత్మికవేత్త శంకరాచార్యుని పేరుతోనే ప్రస్తుతం ఈ ఆలయాన్ని పిలుస్తున్నారు.

జబర్వాన్ పర్వత శ్రేణిలో సముద్రమట్టానికి 11వందల ఎత్తులో ఉందీ గుడి. హెరాత్​గా పిలిచే మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహిస్తుంటారు. ప్రపంచదేశాల నుంచి పర్యటకులు, భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతుంటారు.

ఇక్కడ పూజలు నిర్వహించే భక్తుల కోరికలను శివుడు తప్పకుండా నెరవేరుస్తాడని వారిలో నమ్మకం. అయితే భక్తుల కోరికల్లో నిజాయతీ ఉండాలని అక్కడివారు పేర్కొంటారు. వారి సొంత అవసరాల కోసమే కాక జమ్ముకశ్మీర్ ప్రాంతంలో శాంతి నెలకొనాలని భక్తులు ప్రార్థిస్తారని తెలుస్తోంది.

"ప్రపంచంలో శాంతి సౌభ్రాతృత్వాలు నెలకొనాలని ప్రార్థించాను. మాకు క్షేమం కలగాలని కోరుకున్నాను. మహాశివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించాం. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులను మార్చేందుకు భోళేనాథ్​ను ప్రార్థించాను. కశ్మీర్​లో శాంతి, సోదరభావం నెలకొనాలని వేడుకున్నాను."

-రేణుకా గుప్తా, భక్తురాలు

ఇదీ చరిత్ర...

ఈ ఆలయాన్ని 8 భుజాల పునాదిపై నిర్మించారని సమాచారం. మొదటగా సాదిమన్ రాజు నిర్మించగా అనంతరం క్రీ.పూ. 1368లో గోపాధిత్య రాజు నవీకరించారని తెలుస్తోంది. తర్వాత ముస్లిం రాజు జైన్ ఉల్ అబ్దిన్ ఈ ఆలయ పైకప్పును పునర్నిర్మించారని సమాచారం. 1844లో సిక్కు పాలకుడు షేక్ గులాం మొహీయుద్దీన్ ఆలయ గుమ్మటాన్ని నవీకరించారని ప్రతీతి.

శంకరాచార్య ఆలయానికి తూర్పున దాల్ సరస్సు, పశ్చిమాన హరిపర్​భాత్ కోట ఉంది. ఈ ఆలయానికి ఎదురుగా మసీదు, హిందూ ఆలయం, సిక్కు గురుద్వారాలు కలిసి ఉండే కూహ్ ఈ మారన్ ఉంటుంది. ఈ ఆలయానికి 250 మెట్లు ఉంటాయి. భద్రతా కారణాల రీత్యా పారామిలిటరీ దళాలూ ఇక్కడ పహారా కాస్తుంటాయి. కార్లు, మొబైల్ ఫోన్లు, వీడియో, కెమెరాలు ఆలయ ప్రాంగణంలోకి నిషేధించారు.

Last Updated : Mar 2, 2020, 2:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.