ముంబయిలోని ఓ ల్యాబొరేటరీలో ఉంచిన లిక్విడ్ నైట్రోజన్ సిలిండర్ పేలి భవనంలోని కొంతభాగం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. సెంట్రల్ ముంబయి వొర్లిలోని 'సెంచరీ' భవనంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.
భవనంలోని ల్యాబ్లో ఉన్న ఈ లిక్విడ్ నైట్రోజన్ సిలిండర్ సామర్థ్యం 250 లీటర్లుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారని.. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. గాయాలు స్వల్పంగానే అయిన కారణంగా ఆస్పత్రికి వెళ్లేందుకు బాధితురాలు నిరాకరించిందని తెలిపారు.
ఇదీ చదవండి- దేశంలోనే తొలిసారి సరికొత్త సాంకేతిక మాస్కు!