ETV Bharat / bharat

మహారాష్ట్రలో 19 వేలు దాటిన కరోనా బాధితులు - రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు

దేశంలో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. కరోనా కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో ఇవాళ మరో 1,089 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఆ రాష్ట్రంలో కొవిడ్​-19 సోకిన వారి సంఖ్య 19 వేలు దాటింది. తమిళనాడులో 600, గుజరాత్​లో 390, పంజాబ్​లో 133 మందికి ఇవాళ కొత్తగా వైరస్​ సోకింది. ఝార్ఖండ్​లో నేడు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Maharashtra: 90, including 72 SRPF men, test positive in Aurangabad
మహారాష్ట్రలో 19 వేలు దాటిన కరోనా బాధితులు
author img

By

Published : May 8, 2020, 9:25 PM IST

దేశంలో రోజురోజుకూ కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. కరోనా కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో ఇవాళ అత్యధిక వైరస్ కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో గుజరాత్, దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు ఉన్నాయి.

మహారాష్ట్రలో 19 వేలు దాటిన కేసులు

గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో మరో 1,089 మందికి వైరస్​ సోకింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 19,063 మందికి చేరినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. 731 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 3,470 మంది డిశ్చార్జి​ అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో రోజూ అత్యధిక కేసులు నమోదు అవుతోన్నందున మే చివరి వరకు లాక్​డౌన్​ను పొడిగించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ఠాక్రే సంకేతాలిచ్చారు.

తమిళనాడులో 6 వేల కరోనా బాధితులు

పొరుగు రాష్ట్రం తమిళనాడులో నానాటికి వైరస్​ ఉద్ధృతమవుతోంది. గడిచిన 24 గంటల్లో 600 మందికి వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వీరిలో 405 మంది పురుషులు కాగా 195 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వైరస్ బాధితుల సంఖ్య 6,009కి పెరిగినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం వెల్లడించింది. ఇవాళ మరో ముగ్గురు మృతి చెందగా... మొత్తంగా 40 మంది మహమ్మారికి బలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,605 ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు అధికారులు తెలిపారు. మద్యం కొనుగోళ్లకు పెద్ద ఎత్తున మందుబాబులు క్యూ కడుతోన్న వేళ మద్యం దుకాణాలు మూసేవేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.

గుజరాత్​లో మరో 390 కరోనా బాధితులు

గుజరాత్​లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మరో 390 మందికి వైరస్ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 7,403కు చేరినట్లు అధికారులు తెలిపారు. తాజాగా 24 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 449 మంది వైరస్​కు బలయ్యారు. ఇవాళ ఒక్కరోజే 163 మంది డిశ్చార్జి కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,872 మంది కోలుకున్నారు.

బంగాల్​ మరో 9 మంది మృతి

బంగాల్​లో ఇవాళ మరో 9 మంది మృతి చెందగా.. మొత్తం మరణించిన వారి సంఖ్య 88కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 130 కేసులు నమోదు కాగా... ఇప్పటి వరకు 1,678 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మధ్యప్రదేశ్​లో 3 వేలు దాటిన కేసులు

మధ్యప్రదేశ్​లో ఇవాళ మొత్తం 90 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,341 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. వీరిలో 1,349 మంది రికవరీ అయినట్లు తెలిపారు. మరో 200 మంది మృతి చెందారు.

పంజాబ్​లో మరో 87 కేసులు

పంజాబ్​​లో నేడు మరో 87 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 1,731 మంది ప్రాణాంతక వైరస్​ బారిన పడినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 152 మందికి వైరస్​ నయమైంది.

ఉత్తర్​ప్రదేశ్​లో మరో 74 మందికి కరోనా

ఉత్తర్​ప్రదేశ్​లో​ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ మొత్తం 74 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,145 మందికి వైరస్​ సోకినట్లు తెలిపారు. మొత్తంగా 1,261 మంది డిశ్చార్జి​ అవ్వగా.. 1,821 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 63 మంది ప్రాణాలు కోల్పోయారు.

కర్ణాటకలో 750కి చేరిన బాధితులు

కర్ణాటకలో ఇవాళ ఒక్కసారిగా కేసులు అధికమయ్యాయి. 24 గంటల్లో కొత్తగా 48 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తంగా 753 మందికి వైరస్​ సోకినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 మంది మృతి చెందగా, 371 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.

రాజస్థాన్​​లో 100 మంది బలి

రాజస్థాన్​లో ఇప్పటి వరకు 100 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారుల వెల్లడించారు. కొత్తగా 26 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం 3,453 మంది కరోనా​ బారినపడ్డారు. వీరిలో ఆ రాష్ట్ర రాజధాని జైపూర్​ నుంచి 1,117 మంది ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,450 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • జమ్ముకశ్మీర్​లో మరో 30 మందికి వైరస్​ సోకగా మొత్తం 823 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో కశ్మీర్​లోయలోనే 755 కేసులు ఉన్నాయి. 450 మంది చికిత్స పొందుతున్నారు. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో మళ్లీ కేసులు అధికమవుతున్నాయి. శుక్రవారం 26 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం 245 మంది మహమ్మారి బారిన పడగా... ప్రస్తుతం 181 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.
  • హిమాచల్​ప్రదేశ్​లో ఇవాళ ఇద్దరికి మాత్రమే వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. వీరిలో ఒకరు రెండేళ్ల చిన్నారి కావడం గమనార్హం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 49 కేసులు నమోదు కాగా.. 39 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు.
  • కేరళలో ఇవాళ ఒకరికి మాత్రమే కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 503 మందికి వైరస్​ సోకగా.. ప్రస్తుతం 16 యాక్టివ్​ కేసులు మాత్రమే ఉన్నట్లు తెలిపారు.
  • ఝార్ఖండ్​లో ఈ రోజు ఒకరికి కూడా వైరస్​ సోకలేదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 132 మంది మహమ్మారి బారిన పడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.