భారత్‌లో కరోనా కేసులు 5 వేలకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 4వేల 789 మందికి వైరస్ సోకినట్లు స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. దేశంలో మరణాల సంఖ్య 124కు చేరింది. మొత్తం 352 మంది వైరస్‌ను జయించగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,312గా ఉంది.
మహారాష్ట్రలో 1000...
మహారాష్ట్రపై కరోనా వైరస్ విరుచుకుపడుతోంది. ఇక్కడ కరోనా కేసుల సంఖ్య 1018కి చేరింది. ఇందులో సగం కంటే ఎక్కువ మంది బాధితులు ముంబయిలోనే ఉన్నారు. నగరంలో బాధితుల సంఖ్య 642గా ఉంది. మంగళవారం ఒక్కరోజే ఇక్కడ 116 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 64కు చేరింది.
క్వారంటైన్లోకి ఠాక్రే భద్రతా సిబ్బంది
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన భద్రతా సిబ్బందిని క్వారంటైన్‌కి తరలించారు. ముంబయి బంద్రా ప్రాంతంలోని ఆయన నివాసం మాతోశ్రీ సమీపంలోని ఓ టీ కొట్టు యజమానికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. అయితే, లాక్‌డౌన్‌కు ముందు భద్రతా సిబ్బందిలోని పలువురు ఆ కొట్టుకు వెళ్లినట్లు తెలిసింది. ఫలితంగా ఆయన భద్రతా సిబ్బందిలోని దాదాపు 170 మందిని క్వారంటైన్‌కు తరలించారు. దీనిపై వెంటనే అప్రమత్తమైన ముంబయి మున్సిపల్ విభాగం ఆ ప్రాంతంలో పూర్తిగా క్రిమిసంహారిణి చల్లించి శుభ్రం చేయించింది.
ఇదీ చూడండి : కరోనా కాలంలోనూ 14 నెలల పాపతో పోలీసు విధుల్లోకి!