ETV Bharat / bharat

'మహా' మంత్రివర్గ విస్తరణ- 36 మందికి చోటు - కాసేపట్లో 'మహా' మంత్రివర్గ విస్తరణ- ఆదిత్యకు చోటు

Maha Cabinet expansion: 10 Cong MLAs to take oath as ministers
కాసేపట్లో 'మహా' మంత్రివర్గ విస్తరణ- ఆదిత్యకు చోటు
author img

By

Published : Dec 30, 2019, 11:36 AM IST

Updated : Dec 30, 2019, 2:40 PM IST

13:53 December 30

మహారాష్ట్రలో పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ

మహారాష్ట్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. ఊహాగానాలను నిజం చేస్తూ ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచిన ఆదిత్యకు కూడా కేబినెట్‌లో చోటు దక్కింది. మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ చవాన్‌ మంత్రిగా ప్రమాణం చేశారు. వీరితో పాటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన మొత్తం 36 మంది నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ధనుంజయ్‌ ముండే, దిలీప్‌ పాటిల్‌, విజయ్‌ వాడెత్తివార్‌ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 10 మంది కేబినెట్‌, నలుగురు సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ నుంచి 8 మందికి కేబినెట్‌ పదవి.. ఇద్దరికి సహాయ మంత్రి పదవి దక్కింది. శివసేన నుంచి ఆరుగురు మంత్రులు, ముగ్గురు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ మధ్యాహ్నం విధాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. 

వారసుడి ఆగమనం.. 

ఎన్నో దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఓ వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి విజయ ఢంకా మోగించారు. ఆయనే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య. అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నుంచి గెలిచిన ఆయన శాసనసభలోకి అడుగుపెట్టారు. అయితే తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆదిత్యను కేబినెట్‌లో తీసుకోవాలని సంకీర్ణ ప్రభుత్వం చివరి నిమిషంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. నేటి మంత్రి వర్గ విస్తరణలో ఆయన కేబినెట్‌ మంత్రిగా ప్రమాణం చేశారు. 

అజిత్‌ స్థానం పదిలం.. 

మహారాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారి.. రాత్రికి రాత్రే అనూహ్య పరిణామాలకు కారణమైన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌.. గతంలో దేవేంద్ర ఫడణవీస్‌ మూడు రోజుల ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పవార్‌ కుటుంబసభ్యుల ఒత్తిడితో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అయితే, ఆ తర్వాత అజిత్‌ భవితవ్యంపై అనేక నీలినీడలు కమ్ముకున్నాయి. ఆయన్ను  సంకీర్ణ మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అన్నదానిపై తెరవెనుక పెద్ద చర్చే జరిగింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవి కోసం ఎన్సీపీ అజిత్‌ వైపే మొగ్గుచూపినట్లు గతకొంతకాలంగా వార్తలు వినిపించాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ..  మహా వికాస్‌ ఆఘాడీ కూటమి ఉపముఖ్యమంత్రి పగ్గాలను అజిత్‌కు అప్పజెప్పింది.

13:37 December 30

25 మంది మంత్రులు.. 10 మంది సహాయ మంత్రులు

ఎన్నో ఉత్కంఠ పరిణామాల తర్వాత ఏర్పడిన మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబయిలోని విధాన్‌భవన్‌లో ఈ కార్యక్రమంలో..  శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన మొత్తం 35 మంది నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో 25 మంది మంత్రులు కాగా 10 మంది సహాయ మంత్రులు. అజిత్​ పవార్​ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగా.. ఉద్ధవ్​ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, కాంగ్రెస్​ నేత అశోక్​ చవాన్​, ఎన్సీపీ నేత నవాబ్​ మాలిక్​ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు.

అజిత్‌.. మళ్లీ డిప్యూటీ సీఎంగా..

మహారాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారి.. అనూహ్య పరిణామాలకు కారణమైన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌కు తాజా కేబినెట్‌లో చోటు దక్కింది. దేవేంద్ర ఫడణవీస్‌ మూడు రోజుల ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న అజిత్‌కు.. మళ్లీ అదే పదవి ఇచ్చింది ఠాక్రే ప్రభుత్వం. 

ఆదిత్య ఠాక్రేకు మంత్రి పదవి..

ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభకు ఎన్నికైన శివసేన యువనేత, సీఎం ఉద్ధవ్‌ కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా కేబినెట్‌లో చోటు సంపాదించుకున్నాడు.  

కాంగ్రెస్‌ నుంచి వీరే..

మరోవైపు సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్​ పార్టీ తరఫున సీనియర్‌ నేతలు అశోక్‌ చవాన్‌, కేసీ పాడ్వీ, విజయ్‌ వదెత్తివార్‌ సహా అమిత్ దేశ్‌ముఖ్‌, సునిల్‌ కేదార్‌, యశోమతి ఠాకూర్‌, వర్షా గైక్వాడ్‌, అస్లామ్‌ షేక్‌, సతేజ్‌ పటేల్‌, విశ్వజీత్‌ కదమ్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.

13:13 December 30

మంత్రిగా అశోక్​ చవాన్​

మహారాష్ట్ర మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు ఎన్‌సీపీ నేత అజిత్‌ పవార్‌, కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ మంత్రిగా ప్రమాణం చేశారు. మిగతా మంత్రులతో గవర్నర్​ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

13:02 December 30

మహా ఉప ముఖ్యమంత్రిగా మరోమారు పవార్​

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్​ పవార్​ మరోమారు బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు దేవేంద్ర ఫడణవీస్​ ప్రభుత్వంలో ప్రమాణం చేసిన ఆయన... తాజాగా ఉద్ధవ్​ ఠాక్రే కేబినెల్​లో డిప్యూటీ సీఎంగా  ప్రమాణ స్వీకారం చేశారు.  

12:27 December 30

'మహా' విస్తరణలో ఆదిత్య ఠాక్రే, అజిత్​ పవార్​లకు చోటు

మహారాష్ట్రలో నేడు పూర్తి స్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది. కేబినెట్​లోకి 25 మంది మంత్రులు, 10 మంది సహాయ మంత్రులుగా అడుగుపెట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్త వారితో ప్రమాణం చేయించనున్నారు గవర్నర్​.

ముఖ్యమంత్రి కుమారుడు ఆదిత్య ఠాక్రేకు కేబినెట్​లో చోటు కల్పించారు. ఠాక్రే కుటుంబం నుంచి మంత్రి అయిన తొలి వ్యక్తిగా ఆదిత్య రికార్డు సృష్టించనున్నారు.

ముందు నుంచి ఊహించినట్లుగానే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు ఎన్​సీపీ నేత అజిత్​ పవార్​.

12:01 December 30

అజిత్​కు మళ్లీ అదే పదవి!

ఎన్​సీపీ నేత అజిత్​ పవార్... మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారని సమాచారం.

11:28 December 30

కాసేపట్లో 'మహా' మంత్రివర్గ విస్తరణ- ఆదిత్యకు చోటు

మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్త వారితో గవర్నర్​ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

గత నెల 'మహారాష్ట్ర వికాస్ అఘాడీ' కూటమి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో ప్రస్తుతం ఆరుగురు మంత్రులు మాత్రమే ఉన్నారు. ఈరోజు మరో 35 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందులో కాంగ్రెస్ నుంచి 10మంది ఉండగా.. ఉద్ధవ్ తనయుడు ఆదిత్య ఠాక్రేను మంత్రి పదవి వరించనుంది. ఠాక్రే కుటుంబం నుంచి మంత్రి అయిన తొలి వ్యక్తిగా ఆదిత్య రికార్డు సృష్టించనున్నారు.
 
AP Video Delivery Log - 0500 GMT News
Monday, 30 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0457: Australia Wildfires No Access Australia 4246741
Mass evacuations on 'high risk day' for Victoria
AP-APTN-0405: Peru Right To Die AP Clients Only 4246740
Peruvian seeks to change laws on 'mercy killing'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 30, 2019, 2:40 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.