మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్ అధికారి చేసిన సినిమా స్టంట్‌కు ఉన్నతాధికారులు జరిమానా విధించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవడం వల్ల సంబంధిత అధికారిని హెచ్చరించి వదిలేశారు. మరోసారి ఇలా చేయొద్దని తీవ్రంగా మందలించారు.
అసలేం జరిగిందంటే..
దామోహ్ జిల్లాలోని నార్సింగ్గర్హ్ ఎస్సై మనోజ్ యాదవ్ ఇటీవల బాలీవుడ్ సినిమా 'సింగం'లోని ఓ స్టంట్‌ను అనుకరించారు. హీరో అజయ్‌దేవ్‌గణ్ రెండు కార్లపై నిల్చొని ప్రయాణిస్తోన్న విధంగా ఆ ఎస్సై కూడా పోలీసు దుస్తులు ధరించి రెండు కార్లపై నిల్చొనే స్టంట్ చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం వల్ల అధికారులు విచారణ జరిపారు.
జిల్లా ఎస్పీ హేమంత్ చౌహన్.. సంబంధిత ఎస్సైకి రూ.5 వేల జరిమానా విధించి, ఇలాంటి వీడియోలు మరోసారి చేయొద్దని హెచ్చరించారు. అలాంటివి ప్రమాదకరమని, యువతపై ప్రభావం చూపుతాయని మందలించారు.
ఇదీ చదవండి:ముందు చూస్తే కరోనా.. వెనుక చూస్తే క్యాన్సర్!