మధ్యప్రదేశ్ మంద్సర్లోని ఉమ్రావ్ సింగ్ ప్రియమైన ఎద్దు ఇటీవలే మరణించింది. హిందూ ధర్మం ప్రకారం తోటి కుటుంబసభ్యునికి చేసినట్లే, ఊరందరినీ పిలిచి ఎద్దుకు 13 రోజుల కర్మకాండ నిర్వహించాడు ఆ రైతు.
సింగ్ ప్రాణంగా పెంచుకున్న ఎద్దు పేరు 'రెండా'. వారిద్దరిదీ 18 ఏళ్ల అనుబంధం.. ఈ మధ్యే వయోభారంతో రెండా మృతి చెందింది. ఎద్దు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు. రెండా కర్మకాండలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు వారు. పుట్టెడు దుఃఖంతో ఆహ్వాన ప్రతులను ముద్రించి బంధువులందరినీ విందుకు ఆహ్వానించారు.
" ఈ ఎద్దును నేను సంతలో కొన్నాను. అప్పడు నేను చాలా పేదవాడిని. ఎద్దును కొన్నాక, నాకు అదృష్టం కలిసొచ్చింది. పంటలు బాగా పండాయి. పొలాలు కొన్నాను. రెండాను మా కుటుంబసభ్యుడిగా భావించేవాళ్లం. అందుకే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం."
-ఉమ్రావ్ సింగ్, ఎద్దు యజమాని
ఈ ఆధునిక యుగంలో సాటి మనుషులకే విలువ ఇవ్వడం లేదు.. అలాంటిది ఓ ఎద్దును ఇంతలా ప్రేమించడం.. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఎద్దు అదృష్టాన్ని తెచ్చిపెట్టిన విషయం గుర్తు పెట్టుకుని ఇలా మమకారం చాటి చెప్పడం చాలా అరుదు.
ఇదీ చూడండి:నదిలో దూకి బాలికను కాపాడిన జవాన్లు