మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన భర్త కడసారి చూపులకు నోచుకోని ఆ మహిళ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది.
సింధ్‌దుర్గ్ జిల్లా, దోడామార్గ్లోని మోర్లే గ్రామంలో నివాసముంటున్నారు వాసంతి బండేకర్, చంద్రకాంత్ దంపతులు. తన కుమారుడు అమిత్‌ను చూసేందుకు కొద్దిరోజుల క్రితం ముంబయి వెళ్లారు చంద్రకాంత్. అయితే.. అనారోగ్యం కారణంగా మార్చి 22న అక్కడే ఆస్పత్రిలో చేరగా అమిత్ తండ్రికి క్యాన్సర్ అని తేలింది. చికిత్స పొందుతూ ఈ నెల 16న మరణించారు.
లాక్డౌన్ ఎఫెక్ట్...
ముంబయికి సుమారు 490 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసంతికి.. లాక్డౌన్ కారణంగా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తన భర్త అంత్యక్రియలకు హాజరైంది. లాక్డౌన్ కారణంగా.. తన తండ్రిని సొంత గ్రామానికి, తల్లిని ముంబయికి తీసుకొచ్చే పరిస్థితి లేనందున ఇలా అంత్యక్రియలు నిర్వహించామని వాపోయాడు అమిత్.
ఇదీ చదవండి: ఐఐటీ కాన్పుర్ కనిపెట్టిన ఈ పరికరంతో కరోనా కట్టడి!