ETV Bharat / bharat

లాక్​డౌన్ పుణ్యం: 10 ఏళ్లకు ఇంటికొచ్చిన 'దివ్యాంగుడు​' - Inspector Vinod Kumar Yadav Sendhwa

ఛత్తీస్​గఢ్​కు చెందిన ఓ దివ్యాంగుడు లాక్​డౌన్​ పుణ్యమా అని పదేళ్ల తర్వాత తన కుటుంబాన్ని తిరిగి కలుసుకున్నాడు. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన ఆ యువకుడు తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ పోలీసు ఇన్​స్పెక్టర్​ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. చివరకు విజయం సాధించారు.

Lockdown: C'garh PwD missing from 2010 reunited with kin in MP
లాక్​డౌన్ పుణ్యం-10ఏళ్ల తర్వాత ఇంటికొచ్చిన 'లక్ష్మీదాస్​'
author img

By

Published : May 10, 2020, 4:44 PM IST

దేశవ్యాప్తంగా వలస కూలీలకు శాపంగా మారిన లాక్​డౌన్​.. ఛత్తీస్​గఢ్​కు చెందిన 'లక్ష్మీ​ దాస్​' అనే దివ్యాంగుడి పాలిట మాత్రం వరమైంది. సరిగ్గా పదేళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోయిన అతను లాక్​డౌన్​ పుణ్యమా అని తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు.

పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన దాస్​​ను తిరిగి తన కుటుంబంతో కలిపేందుకు మధ్యప్రదేశ్​లోని బర్వాని జిల్లా సెధ్వాకు చెందిన పోలీసు ఇన్​స్పెక్టర్​ వినోద్​ కుమార్​ యాదవ్​ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో దివ్యాంగుడి ఫొటోను షేర్​ చేసి.. దాస్​​ తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని చేరవేశారు.

మహారాష్ట్ర నుంచి కాలినడకన వస్తుండగా.. 20ఏళ్ల దాస్​​ను సెధ్వాలో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు యాదవ్.

" లక్ష్మీదాస్​​ మాట్లాడలేడు కాబట్టి, తన పేరును కాగితంపై రాయమని అడిగాను. అతను 'ఉరావే' అని రాశాడు. అది మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​లోని కొంత మంది ఇంటిపేరని గుర్తించాను. ఆ తర్వాత ఆదాయ పన్ను శాఖ​ అధికారి యువరాజ్ ఠాకూర్​ను సంప్రదించాను. ఆయన యువకుడి ఫొటోను రాష్ట్రంలోని వ్యాట్సాప్​ గ్రూపుల్లో షేరు చేశారు."

- వినోద్​ కుమార్​ యాదవ్​, ఇన్​స్పెక్టర్​

దాస్​​ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసిన తర్వాత.. ఛత్తీస్​గఢ్​కు చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్​ నుంచి తనకు ఫోన్​ వచ్చిందని తెలిపారు యాదవ్​. ఆ యువకుడు కోబ్రా జిల్లాలోని శ్యాహిమూడి గ్రామానికి చెందిన వ్యక్తని, 2010 నుంచి కనిపించట్లేదని ఆ కానిస్టేబుల్​ చెప్పినట్లు వెల్లడించారు.

"దివ్యాంగుడి​ తండ్రి 'ఇత్వార్​ దాస్'​తో వీడియోకాల్​లో మాట్లాడాం. యువకుడి పేరు లక్ష్మీ​ దాస్​ అని అతనే చెప్పాడు. దాస్​​ చిన్నప్పుడు కొంతమంది కూలీలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు వివరించాడు."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.