ETV Bharat / bharat

సరిహద్దుల్లో సమర ధ్వని.. రంగంలోకి వాయుసేన

author img

By

Published : Jun 20, 2020, 7:01 AM IST

వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వద్ద యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనా దొంగదెబ్బ కొట్టిన తరుణంలో మన సైనిక బలగాలు అప్రమత్తమయ్యాయి. దీంతో భారత వాయుసేన రంగంలోకి దిగింది. అధునాతన యుద్ధవిమానాలు, పోరాట హెలికాప్టర్లు సరిహద్దు ప్రాంతంలో గస్తీ కాస్తున్నాయి. అటు చైనా కూడా సైనికులను, యుద్ధవిమానాలను మోహరిస్తోంది. ఆదేశాలు వచ్చిన మరుక్షణం రంగంలోకి దిగేలా వాటిని సన్నద్ధం చేసుకుంటున్నాయి.

Ladakh stalemate: BRO expedites work near India-China border
సరిహద్దుల్లో సమర ధ్వని

తూర్పు లద్దాఖ్‌లో భారత్‌, చైనా బలగాల మధ్య భీకర ఘర్షణ జరిగిన గల్వాన్‌ లోయ వద్ద పరిస్థితి గుంభనంగా ఉంది. 'డ్రాగన్'’ దొంగదెబ్బ నేపథ్యంలో మన సైనిక దళాలు అప్రమత్తమయ్యాయి. చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్దకు భారీగా బలగాలను పంపుతున్నాయి. భారత వాయుసేన కూడా రంగంలోకి దిగింది. పోరాట సన్నద్ధతలో భాగంగా అదనంగా అధునాతన యుద్ధవిమానాలు, పోరాట హెలికాప్టర్లను పంపింది. ఈ లోహ విహంగాలు ఇప్పటికే గగనతలంలో ఉద్ధృతంగా గస్తీ తిరుగుతున్నాయి. వీటి గర్జనలు, సైనికుల మోహరింపులతో ఈ పర్వత ప్రాంతం మారుమోగుతోంది.

  • తన అమ్ములపొదిలోని కీలకమైన సుఖోయ్‌-30 ఎంకేఐ, మిరాజ్‌-2000, జాగ్వార్‌ యుద్ధవిమానాలను భారత వాయుసేన గత మూడు రోజుల్లో శ్రీనగర్‌, అవంతిపొర, లేహ్‌ ప్రాంతాలకు పంపింది. ఆదేశాలు వచ్చిన మరుక్షణం రంగంలోకి దిగేలా వాటిని సన్నద్ధం చేసింది.
  • ఇటీవలే అమెరికా నుంచి సమకూర్చుకున్న అధునాతన అపాచీ హెలికాప్టర్లనూ భారత్‌ మోహరించింది. సిక్కిం, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌కూ మరిన్ని యుద్ధ విమానాలను తరలించింది.
    Ladakh stalemate: BRO expedites work near India-China border
    సరిహద్దులో గస్తి కాస్తున్న హెలికాఫ్టర్​

చైనా కూడా అదనపు బలగాలు, యుద్ధవిమానాలను మోహరిస్తోంది. చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌.కె.ఎస్‌.భదౌరియా బుధ, గురువారాల్లో జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌లలో పర్యటించారని అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. వాయుసేన పోరాట సన్నద్ధతను సమీక్షించారని తెలిపాయి. భారత సైన్యం ఇప్పటికే అరుణాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, లద్దాఖ్‌లలో ఎల్‌ఏసీ వెంబడి భారీగా ఆయుధాలు, సైనికులను తరలించిందని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న స్థావరాల్లో సైనిక, వాయుసేన బలగాన్ని పెంచాలని సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ మోహరింపులు జరుగుతున్నాయి. భారత నౌకాదళాన్నీ ప్రభుత్వం రంగంలోకి దించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో అప్రమత్తత స్థాయిని పెంచాలని ఆదేశించింది. ఈ ప్రాంతంలో చైనా నౌకాదళం తరచూ కార్యకలాపాలు సాగిస్తోంది.

యుద్ధ విమానం

విస్తృతంగా గగనతల గస్తీ

లేహ్‌ ప్రాంతంలో భారత యుద్ధవిమానాలు, పోరాట హెలికాప్టర్లు విస్తృతంగా గస్తీ తిరుగుతున్నాయి. భారత సైన్యం కార్యకలాపాలు సాగిస్తున్న చోట వారికి మద్దతుగా అపాచీ హెలికాప్టర్లు గగనతలంలో చక్కర్లు కొడుతున్నాయి. అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌ యుద్ధాల్లో సత్తా చాటిన ఈ లోహవిహంగాలు అత్యంత అధునాతన క్షిపణులు, బాంబులతో శత్రువు వెన్నులో దడ పుట్టించగలవు.

చైనా కూడా..

చైనా సైన్యం కూడా గల్వాన్‌ లోయలో భారత శిబిరాలకు కిలోమీటరు దూరంలో భారీగా మోహరింపులు చేపట్టినట్లు ఉపగ్రహ చిత్రాలు బట్టి స్పష్టమవుతోంది. ఆ దేశ వైమానిక దళం కూడా తన కార్యకలాపాలను ఉద్ధృతం చేసింది. టిబెట్‌లోని ఎంగారి వైమానిక స్థావరం వద్ద మౌలిక వసతులను భారీగా పెంచుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. సరిహద్దుల్లో చైనా చొరబాట్లకు పాల్పడిన పాంగాంగ్‌ సరస్సుకు చేరువలో ఈ స్థావరం ఉంది. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని స్కర్దు వైమానిక శిబిరంలోనూ చైనా తన యుద్ధవిమానాలను మోహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని మన వైమానిక దళం నిశితంగా పరిశీలిస్తోంది.

భారత్​కు అనుకూలం.. చైనాకు మాత్రం!

చైనా వైమానిక స్థావరాలన్నీ చాలా ఎత్తయిన ప్రదేశాల్లో ఉన్నాయి. దీంతో అక్కడి నుంచి నింగిలోకి లేచే యుద్ధవిమానాలు ఎక్కువ ఆయుధాలను మోసుకెళ్లలేవు. భారత వాయుసేనకు ఈ ఇబ్బందిలేదు. జమ్ముకశ్మీర్‌లోని వైమానిక స్థావరాలతోపాటు బరేలీ, ఆదంపుర్‌ వంటి మైదాన ప్రాంతాల్లోని వాయు కేంద్రాల నుంచి కూడా యుద్ధవిమానాలను రంగంలోకి దించే వెసులుబాటు ఉంది. ఇవి పూర్తిస్థాయిలో ఆయుధాలు, ఇంధనాన్ని మోసుకెళ్లే వీలుంది.

మరోవైపు గల్వాన్‌ లోయలో దాడి నేపథ్యంలో చైనా ఉత్పత్తులు, పెట్టుబడులను బహిష్కరించాలంటూ భారత్‌లో వస్తున్న డిమాండ్‌పై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిజియాన్‌ ఆచితూచి స్పందించారు. భారత్‌తో సంబంధాలకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి రెండు దేశాలూ చర్చలు జరుపుతున్నాయని చెప్పారు. గల్వాన్‌లో ఘర్షణలకు భారతే కారణమని ఆరోపించారు.

భారత సైనికుల విడుదల

గల్వాన్‌ లోయలో సోమవారం జరిగిన ఘర్షణలో 10 మంది భారత సైనికులను చైనా నిర్బంధించింది. వీరిలో మేజర్‌ హోదా కలిగిన ఇద్దరు అధికారులు కూడా ఉన్నారు. గురువారం ఇరుదేశాల సైనిక ఉన్నతాధికారుల భేటీ అనంతరం వీరిని చైనా విడిచిపెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై శుక్రవారం బీజింగ్‌లో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ను ప్రశ్నించినప్పుడు.. ఆయన సూటిగా బదులివ్వలేదు. భారత సైనికులెవరూ 'ప్రస్తుతం' తమ నిర్బంధంలో లేరని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాటి ఘటనలో మన బలగాలేవీ గల్లంతు కాలేదని భారత సైన్యం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.