ETV Bharat / bharat

మేయర్​గా ఎన్నికైన 21 ఏళ్ల ఆర్య - left democratic front

తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్​గా ఆర్య రాజేంద్రన్​ ఎన్నికయ్యారు. ఇటీవలె స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన ఆర్య.. రెండు వేలకుపైగా మెజారిటీ సాధించారు.

Kerala: 21-year-old Arya Rajendran elected as the Mayor of Thiruvananthapuram Municipal Corporation.
తిరువనంతపురం మేయర్​గా 21 ఏళ్ల ఆర్య
author img

By

Published : Dec 28, 2020, 1:25 PM IST

Updated : Dec 28, 2020, 1:55 PM IST

చిన్న వయసులోనే కేరళ స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా నిలబడి అందరి దృష్టిని ఆకర్షించిన 21 ఏళ్ల ఆర్య రాజేంద్రన్..​ తిరువనంతపురం మేయర్​గా సోమవారం ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన సభ్యులంతా కలిసి ఈమేరకు ఆర్యను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికతో దేశంలో అతి పిన్న వయస్కురాలైన మేయర్​గా ఘనత సాధించారామె.

ఆర్య రాజేంద్రన్ ప్రస్తుతం బాలసంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఎస్​ఎఫ్ఐ రాష్ట్ర కమిటీలోనూ సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవల జరిగిన తిరువనంతపురం పురపాలక సంస్థ ఎన్నికల్లో ముడవన్​ముగల్​ వార్డు నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి, గెలిచారు. ప్రత్యర్థి రెండు వేలకుపైన భారీ మెజారిటీ సంపాదించారు. బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్య.. అందరికీ ఆరోగ్యం అందాలన్నదే లక్ష్యమని అనేక సందర్భాల్లో తెలిపారు.

ప్రముఖుల అభినందనలు..

మేయర్​ ఆర్యకు కొన్ని రోజులుగా ప్రముఖుల నుంచి అభినందలు వెెల్లువెత్తున్నాయి. ప్రముఖ నటుడు మోహన్​లాల్​ ఆర్యకు శనివారం ఫోన్​ చేసి అభినందించారు. వ్యాపారవేత్త గౌతమ్​ అదానీ, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్​ ట్విట్టర్ ద్వారా తమ అభినందనలు తెలిపారు.

ఇదీ చూడండి : మేయర్​ ఆర్య..! వయసు చిన్నది.. గెలుపు పెద్దది

Last Updated : Dec 28, 2020, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.