ETV Bharat / bharat

కేజ్రీవాల్ కీలక నిర్ణయం- వారికే మంత్రి పదవులు! - Kejriwal cabinet latest news

కేజ్రీవాల్​ మంత్రివర్గంలో ఎలాంటి మార్పులుండవని పార్టీ వర్గాల సమాచారం. కొత్త ప్రభుత్వంలోనూ.. ప్రస్తుత మంత్రులనే కొనసాగించాలని ఆప్​ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కేజ్రీవాల్​.. ఈనెల 16న ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు. రాంలీలా మైదానంలో జరగనున్న ఈ మహోత్సవంలోనే మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం.

Kejriwal likely to retain cabinet ministers
కేజ్రీవాల్ కీలక నిర్ణయం- వారికే మంత్రి పదవులు!
author img

By

Published : Feb 12, 2020, 7:34 PM IST

Updated : Mar 1, 2020, 3:07 AM IST

దిల్లీ ముఖ్యమంత్రిగా ఈనెల 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్​. వరుసగా మూడోసారి హస్తిన పీఠాన్ని అధిరోహించనున్న నేపథ్యంలో.. నూతన ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరికి అవకాశం లభిస్తుందో అని దిల్లీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొత్తగా ఏర్పాటయ్యే కేజ్రీ మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న మంత్రులనే.. కొనసాగించాలని ఆప్​ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ అదే జరిగితే ప్రస్తుతం కేజ్రీవాల్​ మంత్రివర్గంలో ఉన్న.. మనీశ్ సిసోడియా, రాజేంద్రపాల్ గౌతమ్​, సత్యేందర్​ జైన్, కైలాశ్​ గహ్లోత్​, గోపాల్​ రాయ్​, ఇమ్రాన్​ హుస్సేన్​ మరోమారు మంత్రులుగా పనిచేయనున్నారు.

రాంలీలా మైదానంలో ప్రమాణం

రాంలీలా మైదానం వేదికగా ఫిబ్రవరి 16న ఉదయం 10 గంటలకు కేజ్రీవాల్​ ప్రమాణస్వీకార మహోత్సవం జరగనుంది. గతంలో దిల్లీ ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఇక్కడి నుంచే ప్రమాణం చేశారు కేజ్రీ. అందుకే ఈసారి కూడా ఇదే వేదికను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయమే ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష నేతగా అరవింద్ కేజ్రీవాల్​ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Last Updated : Mar 1, 2020, 3:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.