ETV Bharat / bharat

'జవాన్ల శౌర్య, పరాక్రమాలతోనే  కార్గిల్ విజయం'

author img

By

Published : Jul 26, 2020, 9:39 AM IST

కార్గిల్​ విజయ్​ దివస్​ సందర్భంగా దేశ సైనికుల త్యాగాలను కొనియాడారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా వారి వీరత్వాన్ని గుర్తుచేశారు. భారత సైనికులు దేశాన్ని కాపాడుతోన్న నిజమైన హీరోలని అభిప్రాయపడ్డారు.

'Kargil Vijay Diwas' symbol of India's proud, valour and steadfast leadership: Amit Shah
కార్గిల్ విజయ్ దివస్

'కార్గిల్​ విజయ్​ దివస్​' 21వ వార్షికోత్సవం సందర్భంగా.. సైనికుల త్యాగాలపై ప్రశంసలు కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. సైనికుల శౌర్యాన్ని స్మరించిన షా.. నేడు దేశం గర్వించదగ్గ రోజు అని ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు.

Kargil Vijay Diwas Amit Shah Twitter
అమిత్​ షా ట్విట్టర్​

'కార్గిల్​ విజయ్​ దివస్.. దేశం గర్వించదగ్గ రోజు. సైనికుల వీరత్వం, వెన్నుచూపని నాయకత్వానికి ప్రతీక. వారి మొక్కవోని ధైర్యంతో.. కార్గిల్​లో శత్రువులను తరిమికొట్టి, అక్కడ మన త్రివర్ణపతాకాన్ని రెపరెపలాడించారు. వారు దేశాన్ని కాపాడేందుకు అంకితభావంతో పనిచేస్తున్న నిజమైన హీరోలు.'

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

1999 జులై 26న భారత సైనిక బలగాలు పాకిస్థాన్​ను మట్టికరిపించాయని పేర్కొన్నారు షా.

'అమర జవాన్లకు సలాం'

ఈ సందర్భంగా.. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసి దేశాన్ని రక్షిస్తోన్న వీర సైనికులకు ట్విట్టర్​ వేదికగా ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. అమర జవాన్లకు నివాళులని పేర్కొన్నారు.

Kargil Vijay Diwas Rahul Twitter
రాహుల్​ గాంధీ ట్వీట్​

ఇదీ చదవండి: కార్గిల్ విజయం: సైనిక సమరం.. దౌత్య వ్యూహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.