ETV Bharat / bharat

మిడతల గుంపును చెదరగొట్టలేకపోయిన 'టపాసులు' - జోధ్​పుర్​లో​ మిడతల దాడి

రాజస్థాన్​ జోధ్​పుర్​లోని సరస్వతినగర్​లో పంట పొలాలపై మిడతలు దండెత్తాయి. పెద్ద సంఖ్యలో చెట్లను నాశనం చేశాయి. అధికారులకు సమాచారం అందించినప్పటికీ.. వారు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికలు. వాటిని తరిమికొట్టేందుకు టపాసులు పేల్చినా ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని బాధపడ్డారు.

Jodhpur: locust attack in posh areas of Luni
జోధ్​పుర్​లో​ మిడతల దాడి
author img

By

Published : May 31, 2020, 8:00 PM IST

దేశం మొత్తం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే.. మిడతలు మరో పెద్ద సమస్యగా మారాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలను నాశనం చేసిన ఈ కీటకాలు రాజస్థాన్​ను వణికిస్తున్నాయి. తాజాగా జోధ్​పుర్​ నగరంలోకి ప్రవేశించి.. ప్రజలకు చుక్కలు చూపించాయి. 24 గంటల్లో వేల మొక్కలను నాశనం చేశాయి. ఈ క్రమంలో మిడతల విధ్వంసం గురించి అధికారులకు తెలియజేసినా.. ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు.

జోధ్​పుర్​లో​ మిడతల దాడి

స్పందించలేదు..!

జోధ్​పుర్​లోని సరస్వతినగర్​తో పాటు కుడి భగ్తసాని, మధుబన్ హౌసింగ్ బోర్డ్ ,బస్నీ ప్రాంతాల్లో ఈ మిడతల దండు బీభత్సం సృష్టించాయి. వీటిని తరిమికొట్టేందుకు టపాసులు పేల్చినప్పటికి అవి వదిలి వెళ్లట్లేదని స్థానికులు తెలిపారు. జిల్లా అధికారులు సహా పోలీసులు, మున్సిపల్​​ కార్పొరేషన్​కు​ విషయం తెలియజేసినప్పటికి ఎవరూ సహయక చర్యలకు ముందుకు రాలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చేయలేమని వ్యవసాయ అధికారులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.

"నివాసితులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మిడతలు వాలిన కారణంగా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. ఈ కీటకాలు జనావాస ప్రాంతాలకు దూరంగా వెళ్లిన తర్వాతే రసాయన కారకారలు స్ప్రే చేసి వాటిని తరిమికొట్టేందుకు చర్యలు తీసుకోగలం"అని వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్​ వీరేంద్ర సింగ్ సోలంకి తెలిపారు.

ఇదీ చూడండి:'కరోనాపై పోరులో 'బాహుబలి' ప్రధాని విఫలం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.