ETV Bharat / bharat

సామూహిక అత్యాచారం- నలుగురు అక్కాచెల్లెళ్ల హత్య!

మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో దారుణం జరిగింది. నలుగురు మైనర్ బాలికలను గొడ్డలితో అతికిరాకంగా నరికి చంపారు దుండగులు. అక్కాచెల్లెళ్లయిన ఈ నలుగురిలో ఒకరిని సామూహిక అత్యాచారం చేసి.. ఆ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

minor was gang-raped before murder
మహారాష్ట్రలో సామూహిక అత్యాచారం
author img

By

Published : Oct 17, 2020, 4:45 PM IST

దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో తాజాగా మరో ఘటన జరిగింది. మైనర్లు అయిన నలుగురు అక్కాచెల్లెళ్లను అతి కిరాతకంగా హత్యచేశారు దుండగులు. వీరి వయస్సు 13, 11, 8, 6 సంవత్సరాలు. 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం విషయం బయటకు రాకుండా కప్పిపుచ్చుకునేందుకు దుండగులు ఆ నలుగురిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబధించి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

జల్గావ్ జిల్లా రేవర్​లో బాధిత కుటుంబం నివాసం ఉంటోంది. ఓ పని కోసం తల్లిదండ్రులతో కలిసి మధ్యప్రదేశ్ వెళ్లాడు బాలికల సోదరుడు. ఇంట్లో ఉంటున్న తన చెల్లెళ్లను గమనించాలని నలుగురు స్నేహితులకు చెప్పాడు. ఈ సమయాన్నే అదునుగా తీసుకున్న కిరాతకులు దారుణానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి చిన్నారులు నిద్రిస్తున్న సమయంలో మద్యం సేవించి ఇంట్లోకి చొరబడ్డారు. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సమయంలో నిద్ర నుంచి మేల్కొన్న బాలిక ముగ్గురు చెల్లెళ్లను గొడ్డలితో నరికి చంపినట్లు, అత్యాచారం అనంతరం 13 ఏళ్ల బాలికను సైతం హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

శుక్రవారం ఉదయం ఇంట్లో రక్తపు మడుగులో పడివున్న చిన్నారులను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన వారు బాధితురాలి సోదరుడికి ఫోన్ చేశారు. తన నలుగురు స్నేహితుల గురించి అతడు పోలీసులకు చెప్పాడు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. బాలికల గొంతులపై లోతైన గొడ్డలి గాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

చిత్రహింసలు..

హత్యకు ముందు 13 ఏళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేశారని శవపరీక్షలో తేలింది. అత్యాచారాన్ని ప్రతిఘటించినందుకే నిందితులు ఆమెను తీవ్రంగా హింసించి ఉంటారని అధికారులు పేర్కొన్నారు.

సిట్ ఏర్పాటు..

ఘటన అనంతరం మహారాష్ట్ర మంత్రి గులబ్రావ్ పాటిల్.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అత్యవసర సాయం కింద రూ. 2లక్షలు పరిహారంగా కుటుంబానికి ప్రకటించారు. ఈ కేసుపై దర్యాప్తు జరిపేందుకు సిట్​ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ కూడా బాధితురాళ్ల కుటుంబాన్ని శనివారం పరామర్శించారు.

ఇదీ చూడండి: 12 ఏళ్ల గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం, హత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.