కరోనా బారిన పడి కోలుకున్న ఓ ఇటలీవాసి రాజస్థాన్‌లో మృతిచెందారు. ఆయన మృతికి కరోనా కారణం కాదని జైపూర్ ఎస్ఎమ్ఎస్ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు.
ఇటలీ నుంచి వచ్చిన 69 ఏళ్ల పర్యాటకుడు.. కరోనా బారిన పడి ఇటీవలే ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులు చికిత్స పొందారు. తర్వాత ఆయన పూర్తిస్థాయిలో కోలుకున్నాడు. అనంతరం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. గురువారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల ఆ వ్యక్తి మృతిచెందారని ఎస్ఎమ్ఎస్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సుధీర్ భండారి తెలిపారు. వైరస్ సోకక ముందు నుంచే ఆయనకు గుండె, కాలేయ సంబంధిత వ్యాధులున్నాయి.
దేశంలో 206కు చేరిన కేసులు
దేశంలో ఇప్పటివరకు 206 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. మొత్తం 13,486 మంది నుంచి 14,376 నమూనాలను పరీక్షించినట్లు తెలిపారు.
అందుబాటులో వాట్సాప్ నంబరు
ప్రస్తుతం కరోనా దేశంలో విజృంభిస్తున్నందున అత్యవసర సాయం, వైరస్‌కు సంబంధించిన సమాచారం కోసం ఓ వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబరును విడుదల చేసింది ప్రభుత్వం. "మైగవ్ కరోనా హెల్ప్‌డెస్క్" పేరిట +91 90131 51515 నంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది.
-
#Coronavirus: The Government of India has set up WhatsApp MyGov Corona Helpdesk. pic.twitter.com/TphoMgvinw
— ANI (@ANI) March 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Coronavirus: The Government of India has set up WhatsApp MyGov Corona Helpdesk. pic.twitter.com/TphoMgvinw
— ANI (@ANI) March 20, 2020#Coronavirus: The Government of India has set up WhatsApp MyGov Corona Helpdesk. pic.twitter.com/TphoMgvinw
— ANI (@ANI) March 20, 2020
ఇదీ చదవండి: మాస్క్ లేకుండా తుమ్మినందుకు దేహశుద్ధి!