ETV Bharat / bharat

చంద్రుడిపైకి భారత్​ మరో యాత్ర- జపాన్​తో కలిసి... - ఇండో-జపాన్​ మూన్​ మిషన్​- అధ్యయన కమిటీ ఏర్పాటు

వచ్చే ఏడాది చంద్రయాన్​-3 ప్రయోగానికి సిద్ధమవుతున్న భారతీయ అంతరక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) మరో జాబిలి యాత్రకు సన్నాహాలను మొదలు పెట్టింది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్​ప్లోరేషన్​ ఏజెన్సీ, ఇస్రో సంయుక్తంగా మూన్​ మిషన్​ను చేపట్టనున్నాయి. దీనికోసం అధ్యయన కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఇస్రో అధికారులు.

ISRO forms study group for Indo-Japan moon mission
ఇండో-జపాన్​ మూన్​ మిషన్​- అధ్యయన కమిటీ ఏర్పాటు
author img

By

Published : Sep 22, 2020, 4:07 PM IST

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్​ప్లోరేషన్​ ఏజెన్సీ (జాక్సా) సంయుక్తంగా చేపట్టబోయే మూన్​ మిషన్​ ప్రయోగం త్వరలో పట్టాలెక్కనుంది. నిజానికి... చంద్రయాన్​-3లో ఇస్రో నిమగ్నమైన నేపథ్యంలో మూన్​ మిషన్​ ప్రయోగం ఆలస్యమైంది. ఈ క్రమంలో మూన్​ మిషన్​ కోసం అధ్యయన కమిటీ వేస్తున్నట్లు మంగళవారం ఇస్రో ప్రకటించడం వల్ల.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు స్పష్టమవుతోంది.

2023 తర్వాత ఇరు దేశాల ఉమ్మడి మిషన్​ జపాన్​ వేదికగా ఉండనుంది. ప్రయోగ వాహకంగా ఉపయోగించే హెచ్​3 రాకెట్​ను మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీ తయారు చేయనుంది. ఇది ల్యాండర్​, రోవర్​ రెండూ కలిగి ఉంటుంది.

"ఇండో-జపాన్​ మిషన్​ కోసం ఏం చేస్తామనేది.. చంద్రయాన్​-3 ప్రయోగాన్ని బట్టి ఉంటుంది. వచ్చే ఏడాది చేసే ప్రయోగంలో మేము విజయం సాధిస్తామా? లేదా? అనేది మా పని తీరుకు లోబడి ఉంటుంది. ఈ నెలలో మొదట్లోనే అధ్యయన కమిటీ గురించిన సమాచారం మాకు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే ఇండో-జపాన్​ మిషన్​ మళ్లీ పట్టాలెక్కినట్లే."

- ఇస్రో శాస్త్రవేత్త

చంద్రుని ధ్రువ ప్రాంతాలలో నీటి ఉనికిని కనుక్కోవడం, దాని పరిమాణంపై పరిశోధన చేయడం మూన్​ మిషన్​ ఉద్దేశం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.