ETV Bharat / bharat

కర్ణాటకలో మళ్లీ రాజకీయ సంక్షోభం మొదలైందా? - Political crisis

కర్ణాటకలో రాజకీయ అనిశ్చితిపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల కొంతమంది భాజపా ఎమ్మెల్యేల రహస్య భేటీ ఇందుకు ఊతమిస్తోంది. భాజపా ప్రభుత్వంలో విభేదాలు ఉన్నాయని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య చెప్పటం దీనికి మరింత ఆజ్యం పోసింది. ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు విజయేంద్ర వ్యవహార శైలిపై భాజపా ఎమ్మెల్యేలు తనకు ఫిర్యాదు చేశారని ఆయన చెప్పటం కొసమెరుపు.

political crisis
కర్ణాటక
author img

By

Published : Jun 4, 2020, 2:52 PM IST

కర్ణాటకలో మళ్లీ రాజకీయ సంక్షోభంపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య బుధవారం వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో అన్ని సవ్యంగా లేవని కొంతమంది భాజపా ఎమ్మెల్యేలు తనతో చెప్పినట్లు సిద్ధరామయ్య వెల్లడించారు.

ఇప్పటికే భాజపాలోని ఓ వర్గం ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు నిర్వహించారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో సిద్ధరామయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

"ప్రభుత్వంలో చాలా విభేదాలు ఉన్నాయి. వాళ్ల ఎమ్మెల్యేలు కొంత మంది నన్ను కలిశారు. అంతేకాదు, భాజపా ప్రభుత్వం సవ్యంగా లేదని నాకు చెప్పారు. యడియూరప్ప కేవలం ముఖ్యమంత్రి పాత్ర వహిస్తున్నారు. ఆయన కుమారుడు విజయేంద్రనే ప్రభుత్వాన్ని చేతిలోకి తీసుకున్నారు. పనులు, ఆమోదాలు అన్నీ ఆయనే చూస్తున్నారు."

- సిద్ధరామయ్య, కాంగ్రెస్ ఎల్​పీ నేత

రహస్య భేటీలు!

మంత్రి పదవులు ఆశిస్తున్న కొందరు సీనియర్ ఎమ్మెల్యేలతోపాటు రాజ్యసభ, శాసనమండలి సీట్లపై చాలా మంది భాజపా నేతలు అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది పార్టీలో అంతర్గతంగా విభేదాలను సృష్టించిందని చెబుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఉత్తర కర్ణాటకకు చెందిన వారు ఎమ్మెల్యే కత్తి ఉమేశ్ నివాసంలో గతవారం విందు కోసం కలుసుకోవటం ఈ వార్తలకు బలం చేకూర్చింది.

ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు.. యడియూరప్ప కుమారుడి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పాలన వ్యవహారాల్లో విజయేంద్ర జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ విజయేంద్రను 'రాజ్యాంగేతర ముఖ్యమంత్రి'గా అభివర్ణించారు సిద్ధరామయ్య.

"మేం భాజపా ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం దానంతట అదే పడిపోతుంది. మేం కేవలం ఎదురుచూస్తూ ఉంటాం."

- సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేత

పగటి కలలు మానాలి..

సిద్ధరామయ్య వ్యాఖ్యలపై స్పందించిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప.. పగటి కలలు మానుకోవాలని హితవు పలికారు. ఆయనకు భాజపా ఎమ్మెల్యేలు మద్దతు పలికి.. ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశం రాదని ఎద్దేవా చేశారు.

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇలాంటి వ్యూహాలు పనిచేయవని, ఈ ఊహాగానాలకు త్వరలోనే తెరపడుతుందని భాజపా రాష్ట్ర వర్గాలు తెలిపాయి. అయితే నిలకడ లేని కర్ణాటక రాజకీయ చరిత్రను గమనిస్తే ఈ ఊహాగానాలు రావటం సహజమే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ అనిశ్చితిపై అంచనావేయటం తొందరపాటు చర్య అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

కాంగ్రెస్​లోనూ విభేదాలు..!

కర్ణాటక కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) చీఫ్​గా డీకే శివకుమార్​ నియామకంపైనా సిద్ధరామయ్య గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీపై పట్టు కోల్పోతాననే కారణంతో ఈ నిర్ణయాన్ని సిద్ధరామయ్య వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా గ్రామపంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్​ వాయిదా వేయటాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో కోర్టును కాంగ్రెస్ ఆశ్రయించాలని డిమాండ్ చేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో గతవారం గ్రామపంచాయతీ ఎన్నికలను ఎస్​ఈసీ వాయిదా వేసింది. మొత్తం 6025 గ్రామాల్లో 5,800 పంచాయతీల కాలపరిమితి 2020 జూన్​- ఆగస్టుతో చెల్లిపోనుంది.

ఇదీ చూడండి: ఆపరేషన్​ హస్తం: కర్ణాటకలో ఏం జరుగుతోంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.