ETV Bharat / bharat

గుడ్​న్యూస్: మరింత పెరిగిన కరోనా రికవరీ రేటు - COVID-19 in India

భారత్​లో కరోనా వైరస్​ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలిపింది కేంద్రం. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 62.93 శాతానికి చేరుకున్నట్లు వెల్లడించింది. కేంద్రం, రాష్ట్రాలు, యూటీలు సమన్వయంతో తీసుకుంటున్న చర్యల కారణంగానే ఇది సాధ్యమవుతున్నట్లు స్పష్టం చేసింది.

India's COVID-19 recovery rate
దేశంలో 62.93 శాతానికి కరోనా రికవరీ రేటు
author img

By

Published : Jul 12, 2020, 5:45 PM IST

దేశంలో ఓవైపు కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. వైరస్​ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమన్వయంతో అమలుచేస్తున్న సమర్థమైన చికిత్స విధానం, వ్యాధి నిర్ధరణ చర్యలతోనే ఇది సాధ్యమవుతున్నట్లు వెల్లడించింది. యాక్టివ్​ కేసుల సంఖ్యతో పోలిస్తే కోలుకున్న వారి సంఖ్య 2,42,362 అధికంగా ఉందని చెప్పింది.

" దేశంలో కరోనా కేసుల రికవరీ రేటు 62.93 శాతానికి చేరింది. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నందున ఎక్కువ మంది వైరస్​ నుంచి కోలుకుంటున్నారు. దేశంలో కేవలం 2,92,258 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల్లో 19,235 మంది కోలుకున్నారు. దాంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 5,34,620కి చేరింది."

- కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ

భారత్​లో ఆదివారం ఒక్కరోజే 28,637 కేసులు నమోదయ్యాయి. మరో 551 మంది ప్రాణాలు కోల్పోయారు.

India's COVID-19 recovery rate
కరోనా కేసుల వివరాలు

15 వేల కొవిడ్​ కేంద్రాలు..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,370 ప్రత్యేక కొవిడ్​ ఆస్పత్రులు, 3,062 కొవిడ్​ ఆరోగ్య కేంద్రాలు, 10,334 కొవిడ్​ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కేంద్రం 122.36 లక్షల పీపీఈ కిట్లు, 223.33 లక్షల ఎన్​95 మాస్కులు, 21,685 వెంటిలేటర్లు అందించింది కేంద్రం.

1.15 కోట్ల నమూనాలు..

కొవిడ్​-19 పరీక్షల్లో ఉన్న అడ్డంకులను తొలగించటం సహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్షలను పెంచటం వల్ల రోజూ వారీ నమూనాల పరీక్షల సంఖ్య పెరిగినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. ప్రతి 10 లక్షల మందిలో ప్రస్తుతం 8,396.4 నమూనాలు పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. జులై 11 వరకు మొత్తం 1,15,87,153 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 850 ప్రభుత్వ, 344 ప్రైవేటు ల్యాబుల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి.

ఇదీ చూడండి: సచిన్​ 'పవర్'​ ప్లే- రాజస్థాన్​ దారెటు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.