ETV Bharat / bharat

దేశంలో 900 దాటిన కరోనా కేసుల సంఖ్య - Coronavirus vaccines and treatment

దేశంలో గత 24 గంటల్లో 194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకిన వారి సంఖ్య మొత్తంగా 900 దాటిందని.. ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారాని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైరస్​ను అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

corona
దేశంలో పెరుగుతున్న కరోనా- 900 దాటిన బాధితుల సంఖ్య
author img

By

Published : Mar 28, 2020, 8:45 PM IST

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో నమోదైన 194 కేసులతో కలిపి వైరస్ బాధితుల సంఖ్య 918కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 19 మంది మరణించినట్లుగా వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 819 యాక్టివ్​ కేసులు ఉన్నాయని, 79 మందికి వైరస్ నయమైందని స్పష్టం చేసింది.

corona
900 వందలు దాటిన కరోనా కేసులు

రాష్ట్రాల్లో..

మహారాష్ట్రలో కొవిడ్-19 బాధితుల సంఖ్య 177కి పెరిగింది. మరణించిన వారి సంఖ్య 5గా ఉంది. గుజరాత్​లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతులు నాలుగుకు చేరారు. కేరళలో తొలి వైరస్ మరణం నమోదైంది.

తమిళనాడులో కరోనా పాజిటివ్​గా తేలిన వారి సంఖ్య 42కు పెరిగింది. కర్ణాటకలో మరో 10 మందికి మహమ్మారి సోకినట్లుగా తేలింది. మొత్తంగా రాష్ట్రంలో బాధితుల సంఖ్య 74కు పెరిగింది. వైరస్​ను అడ్డుకునేందుకు ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం సమర్థవంతంగా కృషిచేస్తోందని వెల్లడించింది.

ఇదీ చూడండి: ఇంట్లో గది లేక చెట్టుపై క్వారెంటైన్​ కేంద్రం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.