ETV Bharat / bharat

ఏడు రాష్ట్రాల్లోనే 81 శాతం కరోనా మరణాలు - ఏడు రాష్ట్రాల్లోనే కరోనా మరణాలు

దేశంలో నమోదవుతున్న మొత్తం మరణాల్లో 81 శాతం ఏడు రాష్ట్రాల్లోనే సంభవిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలోని యాక్టివ్ కేసుల్లో 73 శాతం ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉన్నట్లు తెలిపింది. దేశంలో రికవరీల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, మరణాల సంఖ్య తగ్గుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 26 లక్షల మార్క్ దాటిందని స్పష్టం చేసింది.

India's COVID-19 cases, fatalities per million among the lowest in world; 81 pc deaths from 7 states
ఏడు రాష్ట్రాల్లోనే 81 శాతం కరోనా మరణాలు
author img

By

Published : Aug 29, 2020, 6:36 PM IST

Updated : Aug 29, 2020, 7:56 PM IST

భారత్​లో పది లక్షల జనాభాకు నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల ప్రపంచదేశాలతో పోలిస్తే అత్యంత తక్కువగా ఉందని కొవిడ్​పై ఏర్పాటైన ఉన్నత స్థాయి మంత్రివర్గ బృందం వెల్లడించింది. శనివారం సమావేశమైన మంత్రివర్గ బృందం.. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితిని వివరించినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది.

India's COVID-19 cases, fatalities per million among the lowest in world; 81 pc deaths from 7 states
కరోనా కేసుల వివరాలు

పది లక్షలకు దేశంలో 2,424 కేసులు నమోదవుతుండగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సగటు 3,161గా ఉందని మంత్రివర్గ బృందం తెలిపింది. అదేసమయంలో మరణాల సంఖ్య పదిలక్షలకు 44గా ఉండగా.. ప్రపంచదేశాల్లో ఈ సంఖ్య 107.2గా ఉన్నట్లు వెల్లడించింది.

కరోనా కేసులు- రాష్ట్రాల జాబితా
  • దేశంలోని యాక్టివ్ కేసుల్లో 73 శాతం ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉన్నట్లు మంత్రివర్గ బృందం వెల్లడించింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్, పశ్చిమ్ బంగ, ఒడిశా, తెలంగాణ ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపింది.
  • కరోనా వల్ల మరణిస్తున్న బాధితులు 7 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. మొత్తం మరణాల్లో 81 శాతం మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్, పశ్చిమ్ బంగ రాష్ట్రాల్లోనే నమోదైనట్లు వెల్లడించింది.
  • అయితే త్వరలో పండగల సీజన్ రానున్న నేపథ్యంలో మంత్రివర్గ బృందం కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సమావేశాల కోసం మార్గదర్శకాలు

కొవిడ్ నియంత్రణలో భారత్ గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని కేంద్ర వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల కోసం మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

దేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, మరణాల సంఖ్య తగ్గుతోందని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 26 లక్షల మార్క్ దాటిందని స్పష్టం చేసింది. ఫలితంగా రికవరీ రేటు 76.47కి చేరినట్లు వివరించింది. అధిక మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాలతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించింది.

టీకా ఎక్కడివరకొచ్చింది?

కొవిడ్ వ్యాక్సిన్​ అభివృద్ధిపై భారత్​ సహా ప్రపంచదేశాలు చేస్తున్న ప్రయత్నాలను మంత్రివర్గ బృందానికి వివరించారు డాక్టర్ వీకే పాల్. కరోనాపై ఏర్పాటు చేసిన సాధికారక బృందానికి పాల్ నేతృత్వం వహిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం 29 వ్యాక్సిన్ క్యాండిడెట్లు క్లినికల్ ట్రయల్స్​లో ఉన్నాయని తెలిపారు. ఇందులో రెండు భారతీయ వ్యాక్సిన్​లు ఉన్నాయని చెప్పారు. మొత్తం ఆరు వ్యాక్సిన్​లు మూడో దశ ట్రయల్స్​లో ఉన్నట్లు వివరించారు.

ఇదీ చదవండి- 'మీ చర్యలేంటి?'- ఫేస్​బుక్​కు కాంగ్రెస్ రెండో లేఖ

Last Updated : Aug 29, 2020, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.