ETV Bharat / bharat

వీరికి కరోనా పరీక్షలు తప్పనిసరి! - కరోనావైరస్ భద్రత

సాధారణ జలుబు, దగ్గు వచ్చినా ప్రజలందరిలో ఒకటే ఆందోళన. కొందరైతే తుమ్మడాన్ని ఒక నేరంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి సమయంలో అసలు కరోనా పరీక్షలు ఎవరు చేయించుకోవాలన్నదానిపై ప్రజలకు పూర్తి స్పష్టత లేదు. నేడు వాటిపై స్పష్టత ఇచ్చింది కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ.

Indian Government Clarified When should you get a test for COVID19? and Released a list of testing labs
కరోనా పరీక్షలు ఎవరు చేయించుకోవాలంటే..?
author img

By

Published : Mar 28, 2020, 3:09 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వైరస్​ దెబ్బకు దగ్గినా, తుమ్మినా ఉలిక్కిపడుతున్నారు. సాధారణ జలుబు చేసినా.. కరోనా వైరస్‌ సోకిందేమోనన్న భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు ఎవరు చేయించుకోవాలో స్పష్టం చేస్తూ కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సమాచారపత్రాన్ని విడుదల చేసింది.

  1. గడిచిన 14 రోజుల్లో విదేశాల్లో ప్రయాణం చేసి వచ్చిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాల్సిందే.
  2. కరోనా నిర్ధరణ అయిన వారిని కలిసిన వారు కూడా తప్పక పరీక్షలు చేయించుకోవాలి.
  3. వైద్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ విధిగా పరీక్షలు చేయించుకోవాలి.
  4. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన, పొందుతున్న ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే.
  5. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో, ఇతర తీవ్రమైన వ్యాదులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

వీటితో పాటు ఎవరైనా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు స్వీయ నిర్బంధం, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. కరోనా పరీక్షలు ఎక్కడ చేస్తారు? ఆయా సెంటర్ల మ్యాప్​లతో సహా వివరాలు విడుదల చేసింది.

Indian Government Clarified When should you get a test for COVID19? and Released a list of testing labs
కరోనా పరీక్షలు ఎవరు చేయించుకోవాలో క్లారిటీ ఇచ్చిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.