ETV Bharat / bharat

భారత నేలలో ఇండోనేసియా నీలి వరిపైరు! - Raosaheb Bendre

నీలి, నలుపు రంగు బియ్యాన్ని పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు మన భారతీయ రైతులు. ఇండియా-ఇండోనేసియా వాణిజ్య ఒప్పందం ద్వారా అసోం రాష్ట్రానికి చేరుకున్న ఆ నీలి వరిని.. ఇప్పుడు మహారాష్ట్రలోనూ విస్తరించేలా చేశాడో రైతు.

indian-farmers-grow-indonesias-famous-blue-rice-in-ahmednagar
భారత నేలలో ఇండోనేషియా నీలి వరిపైరు!
author img

By

Published : Sep 27, 2020, 11:54 AM IST

ఇండోనేసియా వరిపైరును భారత్​లో సాగు చేస్తూ.. ఎందరో అన్నదాతలకు లాభాల బాటచూపాడు మహారాష్ట్రకు చెందిన ఓ రైతు.

Indian farmers grow Indonesia's famous blue rice
నీలి వరి

అహ్మద్​నగర్​, మెహందురీకి చెందిన వికాస్ అరోటే మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. కానీ, అనుకోకుండా తన మనసు వ్యవసాయం వైపు మళ్లింది. వ్యవసాయానికి వినూత్నతను, సాంకేతికతను జోడించి ప్రయోగాలు చేయాలనుకున్నాడు. ఇందుకోసం, బంతిపువ్వు విత్తనాలు తెచ్చుకునేందుకు ఓ సారి అసోం వెళ్లాడు. అక్కడే, తనకు నలుపు, నీలి రంగులోని వరి పంట కంటబడింది. వెంటనే అసోం వ్యవసాయ శాఖకు చెందిన రావుసాహేబ్ బింద్రేను సంప్రదించి వివరాలు సేకరించాడు.

నీలి వరిపైరు

ఇండోనేసియాలో విరివిగా పండించే ఈ నీలి రంగు వరి.. భారత్- ఇండోనేసియాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం తర్వాత మన దేశానికి వచ్చిందని తెలుసుకున్నాడు వికాస్. 3 కిలోల నీలి వరి విత్తనాలను మహారాష్ట్రకు తీసుకొచ్చాడు. 5 ఎకరాల్లో వాటిని చల్లి 200 కిలోల విత్తనాలను ఉత్పత్తి చేశాడు. ఆపై, తాను పండించిన విత్తనాలు 20 ఎకరాల్లో సాగు చేసి సత్ఫలితాలు పొందాడు.

ఈ నీలి వరిని ఇప్పటివరకు కేవలం అసోం, మణిపుర్, పంజాబ్ రాష్ట్రాల్లో సాగు చేసేవారు. కానీ, వికాస్​ను ఆదర్శంగా తీసుకొని అకోలే తాలూకా ధామన్వన్, షర్పుంజే ప్రాంతాల్లో దాదాపు 20 మంది రైతులు ఈ ఇండోనేసియా వరిని సాగు చేయడం ప్రారంభించారు.

ఇండోనేసియా బియ్యం

ఫైబర్, ఐరన్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ బియ్యానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. పెద్ద పెద్ద హోటళ్లలో భారీగా డిమాండ్ ఉంది. భారత మార్కెట్లో 'అసోం బ్లాక్ రైస్'గా పిలిచే ఈ నీలి బియ్యం కిలో రూ. 300-500 ధర పలుకుతోంది.

ఇండోనేసియా నీలి అన్నం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గుర్తించి సహకారం అందిస్తే.. భవిష్యత్తులో ఈ నీలి బియ్యాన్ని ఎగుమతి చేయాలనుకుంటున్నాడు వికాస్.

ఇదీ చదవండి: చిలుకకు సమాధి.. ఇది ఎప్పుడైనా విన్నారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.