దేశవ్యాప్తంగా రెండు ప్రాంతాల్లో 10 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. గుజరాత్, మహారాష్ట్రల్లోని రెండు వేర్వేరు కుటుంబాల వారు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో నలుగురు పిల్లలు కూడా ఉండటం గమనార్హం.
గుజరాత్లో ఆరుగురు..
గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు తమ నలుగురు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
పుణెలో నలుగురు..
మహారాష్ట్ర పుణెలోని సుఖ్‌సాగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు ఉరేసి.. తాము కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రాథమికంగా నిర్ధరించారు.
ఇదీ చూడండి: 'మణిపుర్ రాజకీయ ప్రభావం మేఘాలయపై ఉండదు'