ETV Bharat / bharat

'ఐఐటీ, ఐఐఐటీల్లో ట్యూషన్​ ఫీజులు యథాతథం' - 'ఐఐటీ, ఐఐఐటీల్లో ట్యూషన్​ ఫీజులు

2020-21 విద్యా సంవత్సరంలో ఐఐటీ, ఐఐఐటీ సంస్థలు ట్యూషన్‌ ఫీజులు పెంచబోవని తెలిపారు కేంద్ర మానవవనరులశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌. ఐఐటీ డైరెక్టర్లతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

IITs, IIITs not to hike tuition fee for any course in academic year 2020-21: HRD minister
'ఐఐటీ, ఐఐఐటీల్లో ట్యూషన్​ ఫీజులు యథాతథం'
author img

By

Published : Apr 26, 2020, 10:34 PM IST

Updated : Apr 27, 2020, 12:00 AM IST

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ)ల్లో చదివే విద్యార్థులకు తీపి కబురు అందించింది కేంద్రం. ఈ ప్రతిష్టాత్మక సంస్థల్లో 2020-21 విద్యాసంవత్సరానికిగానూ ఏ కోర్సుకూ ట్యూషన్​ ఫీజు పెంచేది లేదని స్పష్టం చేశారు కేంద్ర మానవవనరులశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​.

"ఐఐటీ కౌన్సిల్‌ స్టాండర్డ్‌ కమిటీ ఛైర్మన్‌, ఐఐటీల డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపిన తర్వాత 2020-21 అకడమిక్​ ఇయర్​లో ఏ కోర్సుకూ ట్యూషన్​ ఫీజు పెంచకూడదని నిర్ణయం తీసుకున్నాయి."

-రమేశ్‌ పోఖ్రియాల్ కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి.

అదే విధంగా ఐఐఐటీల్లో కూడా కేంద్రం నిధులతో చదివే వారికి, అండర్​ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో చేరిన వారికి ఏటా పెంచే 10 శాతం ఫీజును కూడా పెంచకూడదని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఇతర కోర్సుల ఫీజులు కూడా పెంచకూడదని వారిని కోరినట్లు వెల్లడించారు పోఖ్రియాల్​.

Last Updated : Apr 27, 2020, 12:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.