ETV Bharat / bharat

ఆ విద్యా సంస్థలకు రూ.150 కోట్ల అక్రమాస్తులు!

తమిళనాడులో ఓ కార్పొరేట్​ కంపెనీ ఆధ్వర్యంలోని పలు​ విద్యాసంస్థలపై దాడులు నిర్వహించింది ఆదాయపన్ను శాఖ. సుమారు రూ.150 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించింది. రూ.5 కోట్ల నగదు, పలు ఎలక్ట్రానిక్​ పరికరాలను స్వాధీనం చేసుకుంది.

I-T raids Tamil Nadu education group
ఐటీ దాడులు
author img

By

Published : Oct 29, 2020, 3:24 PM IST

తమిళనాడుకు చెందిన ఓ కార్పొరేట్​ సంస్థ నడుపుతోన్న పలు విద్యా సంస్థలపై దాడులు నిర్వహించింది ఆదాయపన్ను శాఖ. ఈ క్రమంలో రూ.150 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది.

కోయంబత్తూర్​, ఈరోడ్​, చెన్నై, నమక్కల్​ ప్రాంతాల్లోని విద్యా సంస్థల ప్రాంగణాల్లో బుధవారం దాడులు చేసినట్లు తెలిపింది సీబీడీటీ. వాటితో పాటు ఓ సివిల్​ కాంట్రాక్టర్​ సహా అనుబంధ సంస్థలు, భాగస్వాములపైనా దాడులు చేపట్టినట్లు ఓ ప్రకటన చేసింది.

" సుమారు రూ.150 కోట్ల వరకు లెక్కించని పెట్టుబడులు, ఇతర చెల్లింపులను గుర్తించాం. రూ. 5 కోట్ల నగదు జప్తు చేశాం. కొన్ని లాకర్లు ఇంకా తెరవాల్సి ఉంది. దాడులు కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్​ పరికరాలను పరిశీలిస్తున్నాం. "

- సీబీడీటీ.

విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులను సక్రమంగా అకౌంట్​ పుస్తకాల్లో చూపటం లేదన్న ప్రాథమిక సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపింది సీబీడీటీ. ప్రస్తుతం నిర్వహించిన దాడుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించామని వెల్లడించింది. అక్రమ సొమ్మును వ్యక్తిగత ఖాతాలకు తరలించి.. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా ఐటీ దాడులు- భారీగా నగదు జప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.