లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీసం తమ సొంత ఇంటికి కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇంటికి వెళ్లడం కోసం నాలుకను కోసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన గుజరాత్ బనాసకాంటా జిల్లాలో చోటు చేసుకుంది.
ఇదీ జరిగింది?
మధ్యప్రదేశ్ మోరేనా జిల్లాకు చెందిన వివేక్ శర్మ వృత్తిరీత్యా శిల్పి. ఉపాధి కోసం గుజరాత్‌కు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. శనివారం గుజరాత్ సుయిగామ్ మండలం నాడేశ్వరి గ్రామంలోని ఆలయంలోని కొలను వద్ద రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శర్మను పరిశీలించినప్పుడు తన చేతిలో తెగి ఉన్న నాలుకను గుర్తించామని వెంటనే ఆ వ్యక్తిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
![Homesick migrant sculptor chops off his tongue at Guj temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6852026_hjsd.jpg)
![Homesick migrant sculptor chops off his tongue at Guj temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6852026_jkdj.jpg)
లాక్డౌన్ విధించినప్పటి నుంచి పనులు లేక, అతడు ఇంటి వద్దే ఉంటున్నట్లు ప్రాథమిక విచారణలో తెలినట్లు వెల్లడించారు పోలీసులు. తన నాలుకను దేవుడికి సమర్పిస్తే ప్రస్తుత పరిస్థితులు మారతాయని, వెంటనే ఇంటికి వెళ్లవచ్చని అనుకుని ఈ చర్యకు పాల్పడి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. వాస్తవాలు తెలియాలంటే బాధితుడు కోలుకున్న తర్వాత అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నాక తెలుస్తాయని తెలిపారు.