ETV Bharat / bharat

పిడుగుల ధాటికి దెబ్బతిన్న తాజ్​మహల్ ప్రాంగణం​!

చారిత్రక కట్టడం తాజ్​మహల్​ సమీపంలో పిడుగులు పడ్డాయి. ఈ నేపథ్యంలో చారిత్రక కట్టడం ప్రాంగణంలోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరించడానికి వెంటనే చర్యలు చేపట్టినట్టు అధికారులు స్పష్టం చేశారు.

HEAVY THUNDERS OBSERVED NEAR TAJ MHAL
పిడుగుల ధాటికి దెబ్బతిన్న తాజ్​మహల్​!
author img

By

Published : May 31, 2020, 10:16 PM IST

పిడుగుల ధాటికి చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ ప్రాంగణంలోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. శుక్రవారం రాత్రి ఆగ్రాలోని తాజ్‌మహల్‌ ప్రాంతం పిడుగుల శబ్దంతో దద్దరిల్లింది. దీంతో ప్రఖ్యాత భారత వారసత్వ సంపదైన తాజ్‌మహల్‌కు సంబంధించిన ప్రధాన ద్వారంతో పాటు ప్రధాన గుమ్మటానికి అనుకుని ఉన్న మిగతా గుమ్మటాల పిట్టగోడలు దెబ్బతిన్నాయి.

ఈ విషయంపై భారత పురావస్తుశాఖ అధికారి వసంత్‌కుమార్‌ సావర్కర్‌ మాట్లాడుతూ.. "పిడుగుల ధాటికి రాతితో నిర్మించిన పిట్టగోడ భాగం దెబ్బతింది. అలాగే పాలరాతితో నిర్మించిన మరో పిట్టగోడ‌, పర్యాటకులు నిల్చునే ప్రాంతంలోని పై భాగం, ప్రధాన ద్వారం వద్ద ఉన్న గోడలు దెబ్బతిన్నాయి. ప్రధాన గుమ్మటానికి మాత్రం ఎటువంటి ప్రమాదం లేదు" అని ఆయన పేర్కొన్నారు. వెంటనే వాటి పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో గత రెండు నెలలుగా తాజ్‌మహల్‌ ప్రాంతానికి పర్యటకుల అనుమతిని నిలిపివేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు పిడుగుల ధాటికి ఉత్తర్​ప్రదేశ్‌ రాష్ట్రంలో సుమారు 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:- మిడతల గుంపును చెదరగొట్టలేకపోయిన 'టపాసులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.