ETV Bharat / bharat

హాథ్రస్​ ఘటనపై సిట్ దర్యాప్తు వేగవంతం - యూపీ హాథ్రస్​ అత్యాచారం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్ అత్యాచార​ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆమెకు చికిత్స అందించిన అలీగఢ్​ ఆసుపత్రి వైద్యులను ప్రశ్నించింది.

SIT questions Aligarh docs who treated victim
హాథ్రస్​ ఘటనపై సిట్ దర్యాప్తు వేగవంతం
author img

By

Published : Oct 5, 2020, 10:28 AM IST

Updated : Oct 5, 2020, 11:55 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. అత్యాచార బాధితురాలికి చికిత్స చేసిన జవహర్​లాల్​ నెహ్రూ మెడికల్​ కళాశాల, అలీగఢ్ ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులను కలిసిన సిట్​ బృందం పలు ప్రశ్నలు సంధించింది. గైనకాలజీ, ఆప్తమాలజీ, ఫోరెన్సిక్​, న్యూరోసర్జరీ విభాగానికి చెందిన సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది.

ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఫాస్ట్ ట్రాక్​ కోర్టులోనూ కేసు విచారణ జరుపుతున్నారు. 7 రోజుల్లో సిట్​ దర్పాప్తు నివేదికను సమర్పించాలని యోగి ఆదేశించారు.

నిరాకరణ...

హాథ్రస్​ బాధితురాలి కుటుంబం ఆమె అస్థికలను నీటిలో కలపడానికి నిరాకరించింది. ఆమె మృతదేహన్ని రాత్రికి రాత్రి దహనం చేసిన విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేసింది.

ఇదీ జరిగింది...

సెప్టెంబర్​ 14న యూపీలో దళిత యువతిపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను గొంతుకోసి హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో బాధిత యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని సెప్టెంబర్​ 14న యూపీ అలీగఢ్​లోని జవహర్​లాల్​ నెహ్రూ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం దిల్లీలోని సఫ్దార్​ జంగ్​ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సెప్టెంబర్​​ 29న ఆమె మృతి చెందింది.

Last Updated : Oct 5, 2020, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.