ETV Bharat / bharat

తల్లి కోసం లాక్​డౌన్​లో 1300 కి.మీ సైకిల్​పై...

author img

By

Published : Apr 28, 2020, 5:43 PM IST

లాక్​డౌన్​ వేళ ఓ వ్యక్తి ముంబయి నుంచి హరియాణా చార్కి దాద్రి జిల్లాలోని తన ఇంటికి సైకిల్​ తొక్కుకుంటూ వెళ్లాడు. ఒంటరిగా ఉన్న తన తల్లికి అండగా నిలిచేందుకు 1,281 కిలోమీటర్ల సాహస యాత్ర చేశాడు.

haryana man covered 1400 kilometer to meet ill mother from cycle
తల్లి కోసం 1300 కిలోమీటర్ల సైకిల్​ యాత్ర

కరోనా లాక్​డౌన్​ వేళ ఇతర రాష్ట్రాల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికుల అవస్థలు అన్నీఇన్ని కావు. కొందరు ఎలాగైనా స్వస్థలాలకు చేరాలన్న ఆలోచనతో రకరకాల సాహసాలు చేస్తున్నారు. ఇలానే మహారాష్ట్ర ముంబయి నుంచి హరియాణా చార్కిదాద్రి జిల్లాకు దాదాపు 1,281 కిలోమీటర్లు సైకిల్​ తొక్కుకుంటూ వెళ్లాడు సంజయ్​ రాంపాల్​ అనే వ్యక్తి. ఒంటరిగా జీవిస్తున్న తన తల్లికి అండగా ఉండేందుకే ఇలా చేసినట్లు వెల్లడించాడు.

"నేను నటుడిని. అవకాశాలు వెతుక్కుంటూ మూడు నెలల క్రితం ముంబయి వచ్చాను. నా తల్లి ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ఎలా ఉందోనని కంగారు పడ్డాను. మొదటిసారి విధించిన లాక్​డౌన్​ ఎత్తివేస్తారని భావించి ఇంటికి వెళ్లటానికి టిక్కెట్ బుక్​ చేసుకున్నాను. కానీ లాక్​డౌన్ పొడిగించారు. దీంతో ఆ టిక్కెట్లు పని చేయలేదు."

-సంజయ్​ రాంపాల్​, హరియాణా వాసి.

ఎలాగైనా ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకొని ఓఎల్​ఎక్స్​లో సైకిల్​ కొన్నాడు సంజయ్. దానిపైనే ఇంటికి పయనమయ్యాడు. అలా 16 రోజలపాటు రోజూ 80-90 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. ఈనెల 27న ఇంటికి చేరుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.