లాక్డౌన్లో చేసేందుకు పనుల్లేక.. చేతిలో డబ్బుల్లేక.. ఇంటికి వెళ్లేందుకు రవాణా సౌకర్యాల్లేక వలస కూలీలు పడిన కష్టం అంతా ఇంతా కాదు. కూలీల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వారికోసం ప్రత్యేక రైళ్లు నడపాలని సంకల్పించింది. అయితే... ఇప్పటికే వేల సంఖ్యలో వలస కూలీలు రకరకాల సాహసాలు చేసి స్వరాష్ట్రాలకు చేరుకున్నారు. ఇదీ రీతిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు గుజరాత్లో చిక్కుకుపోయిన ఓ దివ్యాంగుడు. సైకిల్‌పై 296 కిలోమీటర్ల యాత్రను చేపట్టాడు.
గుజరాత్ సూరత్‌లో ఇటుకల బట్టీలో పనిచేసేవాడు మహారాష్ట్ర జల్గావ్ జిల్లా.. నాగల్వాడీ వాసి సాగర్. అతడు దివ్యాంగుడు. లాక్డౌన్ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సూరత్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కొద్దిసేపు నడుస్తూ.. కొంత సమయం సైకిల్ తొక్కుతూ ముందుకు సాగుతున్నాడు. గురువారం సాయంత్రానికి సాగర్ స్వగ్రామానికి చేరుకుంటాడని తెలుస్తోంది.
ఇదీ చూడండి: నవీముంబయి తీరంలో 'ఫ్లెమింగో' స్వేచ్ఛా విహారం