ETV Bharat / bharat

బిహార్​ బరి: ఆర్జేడీ-144, కాంగ్రెస్​-70 స్థానాల్లో పోటీ - బిహార్​ బరి: ఆర్జేడీ, కాంగ్రెస్​, వామపక్షాలు కలిసి పోటీ

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఆర్జేడీ, కాంగ్రెస్​, వామపక్షాలు కలిసే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. అత్యధికంగా రాష్ట్రీయ జనతా దళ్​-144 స్థానాల్లో బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్​ 70 చోట్ల పోటీ చేయనుంది.

Grand Alliance announces seat-sharing formula with Tejashwi as its leader
బిహార్​ బరి: ఆర్జేడీ, కాంగ్రెస్​, వామపక్షాలు కలిసి పోటీ
author img

By

Published : Oct 3, 2020, 6:39 PM IST

బిహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి మహాకూటమి పేరుతో ఎన్నికల బరిలోకి దిగనున్నాయి.

రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజక వర్గాల్లో.. ఆర్జేడీ-144, కాంగ్రెస్-70, వామపక్షాలు-29 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఆర్జేడీకి కేటాయించిన 144 సీట్లలో ముఖేష్ సాహ్నికి చెందిన వీఐపీ పార్టీకి, జేఎమ్​ఎన్​లకు కూడా కొన్ని సీట్లు సర్దుబాటు చేయనున్నారు.

నవంబర్‌లో ఉపఎన్నికలు జరగనున్న వాల్మీకినగర్‌ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించారు. ఈ మేరకు ఆయా పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లు కూటమి నేతలు ప్రకటించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలో.. ఎన్నికల బరిలో నిలవాలని విపక్షాలు నిర్ణయించాయి. విపక్ష కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌ పేరును ప్రకటించారు.

ఇదీ చదవండి: బిహార్​ బీఎస్పీకి షాక్​.. ఆర్జేడీలోకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.