ETV Bharat / bharat

పేదలకు ఉచితంగా 15 కిలోల బియ్యం, 3 కిలోల పప్పులు - గరీబ్‌ కళ్యాణ్ పథకం

దేశంలో రేషన్ కార్డులు ఉన్న కుటుంబంలోని ప్రతి ఒక్కరికి నెలకు ఐదు కిలోల ఆహారధాన్యాలు, కేజీ పప్పు ధాన్యాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది కేంద్రం. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న వాటికి ఇవి అదనమని తెలిపింది. కరోనా వేళ లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Govt to give extra 5 kg grains, 1 kg pulses for free under PDS for next 3 months : FM
పేదలకు ఉచితంగా 15 కిలోల బియ్యం, 3 కిలోల పప్పులు
author img

By

Published : Mar 26, 2020, 3:23 PM IST

దేశంలో రేషన్‌ కార్డులు కలిగి ఉన్న 80 కోట్ల మంది ప్రజలకు ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల చొప్పున ఆహారధాన్యాలు ఉచితంగా అందించనుంది కేంద్రం. వాటితో పాటు ఒక కిలో పప్పు ధాన్యాలు ఇవ్వనుంది. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న ఆహార ధాన్యాలకు అదనంగా రానున్న మూడు నెలల పాటు ఇవి అందించనున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. లాక్​డౌన్​ పరిస్థితుల్లో దేశంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఉండకూడదన్న యోచనతో ఇలా చేస్తున్నట్లు వివరించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు, మధ్యతరగతి వర్గాల వారికి అండగా నిలిచేందుకు కీలక చర్యలు చేపట్టింది కేంద్రప్రభుత్వం. పేదలు, మహిళలు, రైతులు, కార్మికులను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్ పథకం కింద లక్షా 70 వేల కోట్ల రూపాయలతో ప్యాకేజిని ప్రకటించింది.

ఇదీ చూడండి : కేంద్రం 'కరోనా ప్యాకేజీ'తో మీకు కలిగే లాభాలివే....

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.