ETV Bharat / bharat

బోర్డర్​లో తుపాకుల వాడకంపై కొత్త రూల్స్ - గల్వాన్​ లోయ

గల్వాన్​ లోయ ఘటనతో వాస్తవాధీన రేఖ వెంబడి 'రూల్స్​ ఆఫ్​ ఎంగేజ్​మెంట్​'లో కీలక మార్పులు చేసింది భారత్​. అసాధారణ పరిస్థితుల్లో ఆయుధాలను ఉపయోగించే విధంగా సైనికులకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Govt changes RoE across LAC, firearms can be used in 'extraordinary situations'
ఇకపై ఆ విషయంలో సైనికులకు పూర్తి స్వేచ్ఛ
author img

By

Published : Jun 21, 2020, 4:05 PM IST

Updated : Jun 21, 2020, 5:43 PM IST

వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వెంబడి ఆర్​ఓఈ(రూల్స్​ ఆఫ్​ ఎంగేజ్​మెంట్​)లో భారీ మార్పులు చేసింది భారత్​. దీని ప్రకారం.. అసాధారణ పరిస్థితుల్లో సైనికులు కాల్పులు జరిపే విధంగా కమాండర్లు వారికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వొచ్చు. తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో ఈ నెల 15న చైనాతో జరిగిన భీకర పోరులో 20మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది భారత్​.

తుపాకులు ఉన్నా...

గల్వాన్​ లోయలో పక్కా ప్రణాళికతో చైనీయులు భారత జవాన్లపై దాడికి తెగబడ్డారు. సైనికులు తేరుకునే లోపే నష్టం జరిగిపోయింది. అయితే ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లోనూ భారత జవాన్లు తమ దగ్గర అయుధాలు ఉన్నా ఉపయోగించలేదు. చైనాతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తుపాకులను వాడకూడదన్న సీనియర్ల ఆదేశాలే ఇందుకు కారణం. ఫలితంగా 20మంది సైనికులు అమరులయ్యారు.

గల్వాన్​ లోయలో గస్తీ విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల వద్ద ఆయుధాలు లేవా అని విపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై విదేశాంగ మంత్రి జైశంకర్​ కూడా స్పందించారు.

"సరిహద్దులో విధులు నిర్వహించే జవాన్ల వద్ద ఆయుధాలు కచ్చితంగా ఉంటాయి. ఈ నెల 15న గల్వాన్​ లోయలో జరిగిన ఘర్షణ సమయంలోనూ మన సైనికుల వద్ద తుపాకులు ఉన్నాయి. కానీ ఎన్నో ఏళ్లుగా వస్తున్న అలవాటు ప్రకారం జవాన్లు వాటిని ఉపయోగించలేదు."

--- జైశంకర్, భారత విదేశాంగ మంత్రి.​

ఈ ఘటన అనంతరం ఆర్​ఓఈలో మార్పులు చేసింది ప్రభుత్వం. దీని ప్రకారం ఎల్​ఓసీ వెంబడి ఉండే కమాండర్లు.. ఇకపై అసాధారణ పరిస్థితుల్లో స్పందించేందుకు తమ సైనికులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వొచ్చు. ఇందుకోసం అన్ని వనరులను ఉపయోగించుకోవచ్చు. తుపాకులను వాడొచ్చు.

ఇదీ చూడండి- ఆపరేషన్​ కశ్మీర్​: ముగ్గురు ముష్కరులు హతం

Last Updated : Jun 21, 2020, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.