పర్యాటకులకు శుభవార్త. గురువారం నుంచి గోవా పర్యాటకానికి అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మనోహర్ అజ్గనోగర్ బుధవారం వెల్లడించారు. 250 హోటళ్లకు సైతం అనుమతి కల్పించినట్లు పేర్కొన్నారు. 'పర్యాటక శాఖ నుంచి అనుమతి పొందిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నాం. పర్యాటకులు అనుమతి పొందిన హోటళ్లలో వసతికి ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకు ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనుమతి లేని హోటళ్లు ఆతిథ్యం ఇవ్వకూడదు' అని మనోహర్ స్పష్టం చేశారు.
పర్యాటకులు గోవాకు వచ్చేముందు కరోనా పరీక్షలు చేయించుకొని, నెగెటివ్ ధ్రువపత్రంతోనే రావాల్సి ఉంటుంది. లేదా రాష్ట్ర సరిహద్దుల్లోని పరీక్షా కేంద్రం వద్ద టెస్టులు చేయించుకొని ఫలితాలు వచ్చేవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని క్వారంటైన్ కేంద్రంలో ఉండాలి. ఒకవేల పాజిటివ్‌గా తేలితే వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించనున్నారు. లేదంటే వారు కోలుకునే వరకు గోవాలోనే వైద్యం అందించనున్నారు. మార్చిలో లాక్‌డౌన్ విధించనప్పటి నుంచి గోవా పర్యాటకం నిలిచిపోయింది.
ఇదీ చూడండి: 3న లద్దాఖ్‌కు వెళ్లనున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్