ETV Bharat / bharat

బాపూజీ స్వహస్తాలతో లిఖించిన లేఖ వేలం - 1930S MAHATMA GANDHI LETTER AUCTION

జాతిపిత బాపూజీ స్వహస్తాలతో రాసిన ఓ లేఖ ఇప్పుడు వేలానికి సిద్ధమైంది. 1932లో అంటరానితనానికి వ్యతిరేకంగా స్థాపించిన ఓ సంస్థ కోసం.. నిధుల సేకరణలో భాగంగా గాంధీ ఈ ఉత్తరం రాశారు. సుమారు 15వేల డాలర్లు పలుకుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Gandhi's anti-untouchability campaign letter to go under the hammer
బాపూజీ స్వహస్తాలతో లిఖించిన లేఖ వేలానికి సిద్ధం
author img

By

Published : Apr 24, 2020, 12:49 PM IST

అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ 1932లో స్థాపించిన 'హరిజన్​ సేవక్​ సంఘ్' కోసం నిధుల సేకరణకు సంబంధించి.. మహాత్మా గాంధీ లిఖించిన లేఖను వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు.

బోస్టన్​కు చెందిన 'ఆర్​ఆర్​​ ఆక్షన్​' అనే సంస్థ ఈ లేఖను ఆన్​లైన్​లో వేలానికి ఉంచనుంది. సుమారు 15వేల డాలర్లు పలుకుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 1932 అక్టోబరు 9 నాటి కాలానికి చెందిన ఈ లేఖను గాంధీ స్వహస్తాలతో రాశారు.

లేఖలో పేర్కొన్న అంశం

ప్రియమైన మిత్రులారా.. సంఘీభావం తెలుపుతూ మీరు పంపిన లేఖకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ నిధులను జి.డి. బిర్లా అధ్యక్షతన ఏర్పాటు చేసిన అంటరానితనం వ్యతిరేక సంఘానికి పంపిస్తాను.

-మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ

దేశంలో నెలకొన్న అంటరానితనం అనే భావనను నిర్మూలించాలనే సంకల్పంతో.. 1932లో బాపూజీ హరిజన్​ సేవక్​ సంఘ్​ను స్థాపించారు. గాంధీ సన్నిహితుడు, పారిశ్రామిక వేత్త ఘనశ్యామ్​ దాస్​ బిర్లా సంస్థ బాధ్యతలు చేపట్టారు. హరిజన్ సేవక్ సంఘ్ ద్వారా అణగారిన వర్గాలకు దేవాలయాలు, పాఠశాలలు, రోడ్లు, తాగునీరు వంటి అనేక సదుపాయాలను కల్పించారు.

మే 13 నాటికి ముగియున్న ఈ వేలంలో.. ప్రముఖుల ఆటోగ్రాఫ్​లు, కళాఖండాలూ దర్శనమిస్తాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.