మృతుల్లో మయా సోనార్ (50), బిషాల్ సోనార్ (19), షిబ్ సోనార్ (5), శంకర్ సోనార్ (3), నును (50)లు ఉన్నట్లు గుర్తించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రూ.4 లక్షల పరిహారం..
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.
ఇదీ చూడండి: కృత్రిమ గర్భంతో ఒకే కాన్పులో నలుగురు..!