ETV Bharat / bharat

కశ్మీర్​లో స్థానిక ఎన్నికల తొలిదశ పోలింగ్​ షురూ..

author img

By

Published : Nov 28, 2020, 8:06 AM IST

Updated : Nov 28, 2020, 8:22 AM IST

కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు అనంతరం తొలిసారి జరుగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ పోలింగ్​ ప్రారంభమైంది. మొత్తం 43 డిస్ట్రిక్ట్​ డెవలప్​మెంట్​ కౌన్సిల్​(డీడీసీ)లు, 94 నియోజకవర్గాల్లో సర్పంచ్​, 368 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఓటింగ్​ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది.

FIRST PHASE POLLING STARTS FOR LOCAL BODY ELECTIONS IN JAMMU & KASHMIR
కశ్మీర్​లో స్థానిక ఎన్నికల తొలిదశ పోలింగ్​ షురూ..

కశ్మీర్​కు గతేడాది స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ పోలింగ్​ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అందులో భాగంగా 43 డిస్ట్రిక్ట్​ డెవలప్​మెంట్​ కౌన్సిల్​(డీడీసీ)లు, సర్పంచ్​ స్థానాలకు ఓటింగ్​ జరుగుతోంది. మొత్తం 8 దశల్లో పోలింగ్​ నిర్వహణ చేపట్టనున్నారు ఎన్నికల అధికారులు.

FIRST PHASE POLLING STARTS FOR LOCAL BODY ELECTIONS IN JAMMU & KASHMIR
పోలింగ్​ కేంద్రం

భౌతిక దూరం నిబంధనలు

కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే మొదటి దశలో.. డీడీసీ, సర్పంచ్​, ఉప ఎన్నికల్లో మొత్తం 1427 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 43 డీడీసీ స్థానాల్లో పోలింగ్​ జరుగుతోంది. వీటిలో 25 కశ్మీర్​లో ఉండగా.. 18 జమ్ములో ఉన్నాయి.

పర్యవేక్షిస్తున్న అధికారులు

పోలింగ్​ వివరాలు

డీడీసీ ఎన్నికలను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా దళాలు.. పటిష్ఠమైన రక్షణ వలయాలు ఏర్పాటు చేశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో గస్తీ నిర్వహిస్తున్నారు.

జమ్ముకశ్మీర్​లోని 20 జిల్లాల్లో మొత్తం 280 స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 28 నుంచి డిసెంబర్​ 19 వరకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. డిసెంబర్​ 22న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఇదీ చదవండి: పోలింగ్‌ శాతమే ప్రజాస్వామ్యానికి కొలమానం

Last Updated : Nov 28, 2020, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.