ETV Bharat / bharat

కుమార్తెకు పెళ్లి కానుకగా ఎడ్ల బండిలో 2200 పుస్తకాలు - books as wedding gift in gujrat rajkot

గుజరాత్​కు చెందిన ఆమె ఓ రాజపుత్రికట. కానీ, ఆమెకు కట్టుకునేందుకు ఖరీదైన చీరలు, పెట్టుకునేందుకు బంగారు నగలు వద్దంట. నిలువెత్తు పుస్తకాలే ఆమెకు ఆభరణాలంట! కుమార్తె అడగ్గానే ఆ తండ్రి ఆమె కోరిక తీర్చేసెనట! ఆమె పెళ్లి రోజు ఎడ్లబండి నిండా 2200 పుస్తకాలు తెచ్చి బహుకరించెనట! కథ బాగుంది అనుకుంటున్నారా? కథ కాదు వాస్తవమే.

father gifted 2200 books on daughters wedding rajkot gujrat
కూతురి పెళ్లి కానుకగా ఎడ్లబండిలో 2200 పుస్తకాలు!
author img

By

Published : Feb 14, 2020, 2:10 PM IST

Updated : Mar 1, 2020, 8:03 AM IST

కుమార్తెకు పెళ్లి కానుకగా ఎడ్ల బండిలో 2200 పుస్తకాలు

గుజరాత్​ రాజ్​కోట్​కు చెందిన కిన్నరిబా జడేజా పెళ్లికుమార్తె అలంకరణలో వెలిగిపోయింది. ఎడ్లబండిని చూసి ఆనందంలో మునిగి తేలింది. ఎందుకంటే ఆ ఎడ్లబండి నిండా కిన్నరిబాకు ఎంతో ప్రియమైన నిధి నిండి ఉంది.

తండ్రి హర్దేవ్​ సింహ్​ జడేజా తనకు పెళ్లికానుకగా ఇచ్చిన పుస్తక నిధి చుసి వజ్రవైడూర్యాలు దొరికినట్లు మురిసిపోయింది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 2 వేల రెండు వందలకు పైగా పుస్తకాలు బహుమానంగా స్వీకరించి సంతోషం వ్యక్తం చేసింది.

"నేను ఓ రాజ్​పుత్ యువతిని. ధైర్యవంతమైన రాజపుత్రికల చేతిలో శస్త్రాలతో పాటు.. శాస్త్రాలు కూడా ఉండాలి. ఈ తరానికి అస్త్రశస్త్రాల కంటే.. కలం అవసరం ఎక్కువగా ఉంది. కలాన్ని ప్రచారం చేయడానికి.. దానిని మరింత ముందుకు నడపడానికే నా పెళ్లి కానుకగా పుస్తకాలు కొనివ్వమని మా నాన్నను కోరాను. నాన్న నా కోరిక తీర్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాను."

-కిన్నరిబా జడేజా, పెళ్లి కుమార్తె

బాల్యం నుంచే పుస్తకాలతో చెలిమి చేసిన కిన్నరిబా.. పుస్తకాల గొప్పతనాన్ని తన పెళ్లి వేదికపై తెలియజేయాలనుకుంది. అందుకే, కట్నకానుకులకు బదులు తన వివాహ వేడుకలో పుస్తకాలు కావాలని తండ్రిని కోరింది.

"కుమార్తెల వివాహంలో సాధారణంగా తండ్రులు తమ స్తోమతకు తగ్గట్టు బంగారం, వెండి, వాహనాలు, బంగ్లాలు కానుకగా ఇస్తారు. నేను ఓ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిని. నా మనసులో కాస్త వినూత్న ఆలోచన ఉండేది. నా కుమార్తె బాల్యం నుంచి తను దాచుకున్న డబ్బుతో సుమారు 500లకు పైగా పుస్తకాలు సేకరించింది. ఆ పుస్తక ప్రేమతోనే .. ఓ వేదికపై మాట్లాడుతూ.. నాన్న నా పెళ్లిలో బంగారం ఇవ్వకపోయినా, నా బరువుకు సమానమైన పుస్తకాలు నాకు కానుకగా ఇవ్వమని అడిగింది. "

-హర్దేవ్​ సింహ్​ జడేజా, పెళ్లి కుమార్తె తండ్రి

Last Updated : Mar 1, 2020, 8:03 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.