ETV Bharat / bharat

400 ఏళ్ల నాటి 'వింత' చెరువు- 12 గ్రామాలకు ఇదే దిక్కు - రాజస్థాన్​లో వింత చెరువు

ఆ చెరువు 12 గ్రామల దాహార్తిని తీరుస్తోంది. 400 ఏళ్ల క్రితం తవ్వించినట్లు చెబుతున్న చెరువును ఇప్పటివరకు ఇంకిపోవడం ఒక్కసారి కూడా చూడలేదట అక్కడి ప్రజలు. మరి ఆ చెరువు ఎక్కడ ఉంది. అసలు దాని వెనుకున్న కథేంటి?

Jaseri Pond
400 ఏళ్ల నాటి 'వింత' చెరువు- 12 గ్రామాలకు ఇదే దిక్కు
author img

By

Published : Sep 8, 2020, 5:33 PM IST

400 ఏళ్ల నాటి 'వింత' చెరువు- 12 గ్రామాలకు ఇదే దిక్కు

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో, కుల్దారా ఖాభా రహదారిపై, డేఢా గ్రామంలో ఉన్న జసేరీ తాలాబ్ ఇది. స్థానిక చరిత్రకు నిదర్శనం. పరిసరాల్లోని 12 గ్రామాల దాహం తీరుస్తున్న ఈ చెరువును 400 ఏళ్ల క్రితం...జస్‌బాయి తండ్రి తవ్వించినట్లు స్థానికులు, చరిత్రకారులు చెప్తారు. ఆమె పేరుమీదుగానే ఈ చెరువుకు జసేరీ తాలాబ్ అనే పేరొచ్చింది.

"వివాహం తర్వాత జస్‌బాయి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, నీటికోసం ఎక్కడికి వెళ్లినా, పశువులకు నీరు తాగిస్తూ, ఎవరో ఒకరు ఉండేవారు. ఓసారి పిల్లలు ఇంట్లో ఎదురు చూస్తుండడం వల్ల ముందుగా తాను నీరు నింపుకుంటానని అడుగుతుంది జస్‌బాయి. అందుకు ఆయన ఒప్పుకోలేదు. చాలా సేపటి తర్వాత నీటితో ఇంటికి వెళ్లి, తన మరిదికి విషయం చెబితే... నీళ్లు కావాలంటే అలాగే ఎదురు చూడక తప్పదంటాడు మరిది. జస్‌బాయి తండ్రి వద్దకు వెళ్లి, పరిష్కారం కోరగా కుమార్తె కోసం ఏకంగా చెరువునే తవ్వించాడు ఆయన. జస్‌బాయి పేరుమీదుగా ఆ చెరువుకు జసేరీ తాలాబ్‌ అనే పేరొచ్చింది. చెరువు తవ్విన తర్వాత ఇంద్రభగవానుడు ఆశీస్సులు అందించగా వర్షం కూడా పడిందని చెబుతారు".

- విజయ్ బల్లానీ, చరిత్రకారుడు

జసేరీ చెరువు అంచున ఇత్తడి పొర పరిచినట్లు చెబుతారు స్థానికులు. తవ్విన నాటినుంచి, ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా చెరువు ఎండిపోలేదు. కొన్నేళ్ల క్రితం తీవ్రకరవు వచ్చినప్పుడు సైతం... చెరువులోని నీటిస్థాయి తగ్గినా....అడుగు మాత్రం కనిపించలేదు.

"ఈ చెరువు వైశాల్యం, లోతు ఎక్కువ. అందుకే వర్షపు నీరు ఎక్కువమొత్తంలో నిల్వ ఉంటుంది. వర్షం కురిసినప్పుడల్లా నీటితోపాటు, మెత్తని మట్టి కొట్టుకువచ్చి, చెరువు అడుగున పేరుకుపోతుంది. ఫలితంగా చిన్నచిన్న పగుళ్లు కూడా పూడ్చుకుంటాయి. నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండడం, మెత్తని మట్టి పొర వల్ల నీరు ఇంకిపోయే ప్రక్రియ నిదానంగా సాగుతుంది. దీని వెనకాల పూర్తిగా అడవులే ఉంటాయి. అక్కడి నుంచి ప్రవహించే నీరు సైతం ఈ చెరువు ఎండిపోకుండా ఉండేందుకు దోహదపడుతోంది."

-నారాయణ్‌దాస్ ఇనాఖియా, భూగర్భ జల పరిశోధకుడు

జసేరీ చెరువు ఎండిపోకపోవడానికి చాలా కారణాలే చెబుతారు భూగర్భ జల శాస్త్రవేత్తలు. నదులు ప్రవహించే పరిసరాల్లో ఈ చెరువు నిర్మించారు. లోతు కూడా ఎక్కువే. చుట్టుపక్కల నుంచి వచ్చే నీటితో పాటు.. మెత్తని మట్టి కూడా కొట్టుకొస్తుంది. అది అడుగున పేరుకుపోవడం కూడా చెరువు ఎండిపోకపోవడానికి ఓ కారణం.

రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతంలో చుక్క నీరు కూడా ఎంతో విలువైనది. అలాంటి చోట జసేరీ చెరువు నీటిసంరక్షణకు అద్భుత తార్కాణంగా నిలుస్తోంది. ఇంతటి చరిత్ర కలిగిన జసేరీ చెరువు చిత్రపటం.. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రదర్శనకు ఉంచారు. రాజస్థాన్‌లోని సంప్రదాయ మంచినీటి వనరుల సంస్కృతికి ఇది అద్దంపడుతుంది. ఈ చెరువును చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు ఇక్కడికి వస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.