కరోనా నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు అందరి జీవితాల్లో మాస్క్ తప్పనిసరి అయిపోయింది. మరి ఎప్పుడూ సాదాసీదా మాస్కులేనా? సూపర్ స్టార్ మాస్క్, మెగా స్టార్ మాస్క్ పెట్టుకుంటే బావుంటుంది కదా? ఎదుటి వారిని నవ్వించే మీమ్ మాస్క్ ధరిస్తే అదిరిపోతుంది కదూ? అందుకే, తమిళనాడులో ఓ వస్త్ర పరిశ్రమ తయారు చేసిన ఆ మాస్కులు యమ క్రేజ్ సంపాదించుకున్నాయి.
లాక్డౌన్ 3.0లో 50 మంది ఉద్యోగులతో.. వస్త్ర పరిశ్రమలు నడిపేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో తిరుప్పూర్‌లోని సెంటినల్ క్లాతింగ్ సంస్థ మాస్కులు కుట్టడం ప్రారంభించింది. యువకులను ఆకట్టుకునేలా వాటిపై సినీ తారల చిత్రాలను ముద్రించింది. విజయ్, కమల్, అజిత్, రజినీకాంత్ చిత్రాలే కాదు.. బాగా ట్రెండింగ్‌లో ఉన్న కామెడీ మీమ్స్, ప్రముఖ రాజకీయ నాయకుల ఫొటోలతో ముసుగులు రూపొందించింది.
కొద్ది రోజులకే ఈ స్టార్ మాస్క్‌లకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీంతో ఉత్పత్తి మరింత పెంచుతున్నారు పరిశ్రమ యజమాని.
"నేను ఈ నెల ఆరంభం నుంచి మాస్కులు తయారు చేసి భారత దేశమంతా సరఫరా చేస్తున్నాను. సినీ నటీనటుల పోస్టర్లు, మఖ్య రాజకీయ నాయకుల చిత్రాలు ముద్రించి తయారు చేస్తున్నాం. ఇవి ఇప్పుడు ట్రెండ్‌గా మారి బాగా అమ్ముడుపోతున్నాయి."
-వస్త్ర పరిశ్రమ యజమాని
ఇదీ చదవండి:వలస తల్లి కుమారుడికి 'సూట్‌కేస్' రథమైంది!