ETV Bharat / bharat

'ఆరోగ్య సేవలకు ఆటంకం లేకుండా కొవిడ్​ టీకా పంపిణీ' - కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీ

ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సేవలకు ఆటంకం లేకుండా కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీకి కేంద్ర ఆరోగ్య శాఖ భాగస్వామ్యంతో నిపుణుల బృందం ఆరోగ్య వ్యవస్థను సిద్ధం చేస్తోందని తెలిపారు కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు (పీఎస్​ఏ) కే విజయ్ రాఘవన్​. ఇందుకు సార్వత్రిక ఎన్నికలు, టీకాల పంపిణీ అనుభవాలను వినియోగించుకోనున్నట్లు చెప్పారు.

COVID-19 vaccine distribution,
కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీ
author img

By

Published : Nov 29, 2020, 5:53 AM IST

కొవిడ్​-19 వ్యాక్సిన్లు తుది దశ ప్రయోగాల్లో ఉన్న సందర్భంగా పంపిణీకి సిద్ధమవుతోంది కేంద్రం. అన్ని సౌకర్యాలను వినియోగించుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సేవల్లో ఎలాంటి రాజీ లేకుండా కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీ, నిర్వహణ కోసం ఆరోగ్య వ్యవస్థను.. కేంద్ర ఆరోగ్య శాఖ భాగస్వామ్యంతో నిపుణుల బృందం సిద్ధం చేస్తోందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు (పీఎస్​ఏ) ప్రొఫెసర్ కే విజయ్ రాఘవన్ వెల్లడించారు. కొవిడ్​ మహమ్మారి.. పరిశోధనా కేంద్రాలు-పరిశ్రమ, పరిశ్రమ-సమాజం మధ్య అసాధారణ సహకారాన్ని ప్రేరేపించిందని నొక్కి చెప్పారు.

" ప్రస్తుత ఆరోగ్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా వ్యాక్సిన్​ పంపిణీకి ప్రణాళికలు రచిస్తోంది నిపుణలు బృందం. పెద్దఎత్తున వ్యాక్సిన్​ పంపిణీ కార్యక్రమానికి.. గతంలో నిర్వహించి సార్వత్రిక ఎన్నికలు, టీకాల పంపిణీ అనుభవాలను వినియోగించుకొనున్నాం."

- విజయ్​ రాఘవన్​, కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు

నవంబర్​ 26న వర్చువల్​గా జరిగిన గ్లోబల్​ ఇన్నోవేషన్​, టెక్నాలజీ అలియన్స్​(జీఐటీఏ) 9వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రసంగించిన సందర్భంగా ఈ మేరకు వెల్లడించారు రాఘవన్​. ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు, అంతర్జాతీయంగా సహకారాన్ని పెంపొందించేందుకు సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఇదీ చూడండి:'భారతీయులందరికీ టీకా అందేది అప్పుడే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.